26 ఏళ్ళు మీకు ఊడిగం చేసింది అలాంటి వదినను ఇంతగా అవమానిస్తారా అంటూ మాధవి తిడుతుంది. అనసూయను అమ్మ అని పిలవాల్సి వస్తుందని బాధ పడుతున్న అంటే నువ్వు వెళ్ళిపో అంటుంది. ఆ రాక్షసి అందరిని దూరం చేస్తుంది అని అంటే నీకు నువ్వుగా అందరిని దూరం చేసుకుంటున్నావ్ అంటూ సీరియస్ అవుతుంది. ఇంకా మాటలు ఆపు మాధవి అంటూ నందు సీరియస్ అవుతాడు. ఆతర్వాత సీన్ లో తులసి, సామ్రాట్ ఇల్లు చూడటానికి వస్తారు.. ఇద్దరు బాగుందని అనుకుంటారు. ఇంటి ఓనర్ ఇల్లు ఇవ్వాలి అనుకోవాలి అప్పుడే మనకు ఇల్లు దక్కుతుంది అని అంటుంది.