అనంతపురంలో ‘వీరసింహారెడ్డి’ టీం.. శరవేగంగా షూటింగ్.. న్యూ షెడ్యూల్ డిటేయిల్స్.!

Published : Nov 08, 2022, 11:16 AM IST

నందమూరి నటసింహం, బాలకృష్ణ (Balakrishna) తాజాగా నటిస్తున్న ‘వీరసింహా రెడ్డి’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా అనంతపురంలో న్యూ షెడ్యూల్ ప్రారంభించబోతోంది.  

PREV
16
అనంతపురంలో ‘వీరసింహారెడ్డి’ టీం.. శరవేగంగా షూటింగ్.. న్యూ షెడ్యూల్ డిటేయిల్స్.!

నందమూరి నటసింహం, సీనియర్ హీరో బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. యంగ్ హీరోలకు పోటీగా సినిమాలను చేస్తున్నారు. రీసెంట్ గా ‘అఖండ’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. 
 

26

అదే జోష్ లో  మరో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
 

36

ఇదివరకే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకోగా తాజాగా కొత్త షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు అందాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ‘వీరసింహారెడ్డి’ న్యూ షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. అనంతపురం జిల్లాలో ఈ షెడ్యూల్ ను కొనసాగించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
 

46

ఈ నెల 9న (రేపు) పెన్నోహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వద్ద చిత్రీకరణ ప్రారంభం కానుంది. రెండు, మూడో రోజు నవంబర్ 10, 11న అమిధ్యాల, రాకెట్ల, ఉరవకొండలో షూటింగ్ జరగనుంది. 12, 13న పెనుగొండ ఫోర్ట్ వద్ద జరపనున్నారు. ఈ ఐదు రోజుల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.
 

56

చివరి దశ షూటింగ్ లో ఉన్న ‘వీరసింహారెడ్డి’ త్వరలోనే షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకోనుంది.  ప్రస్తుతం ఎక్కడా ఆలస్యం లేకుండా చిత్రీకరణను జరుపుతున్నారు దర్శకుడు గోపీచంద్ ఇక ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా టైటిల్ లోగోను వినూత్నంగా  కొండారెడ్డి బురుజు పై ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
 

66

మరింత మాస్ లుక్ లో బాలకృష్ణ అదరగొట్టనున్నారు. చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan)గా నటించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసురాబోతోంది. ధునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!

Recommended Stories