Devatha: మరో షాకింగ్ ప్లాన్.. ఆదిత్య 'ప్లాన్'ను ఆసరగా తీసుకున్న మాధవ!

Published : Jul 05, 2022, 12:09 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జూన్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Devatha: మరో షాకింగ్ ప్లాన్.. ఆదిత్య 'ప్లాన్'ను ఆసరగా తీసుకున్న మాధవ!

మాధవ (Madhava) కొత్త కారులో దేవిని బయటికి తీసుకొని వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మాధవ అక్కడ పక్కకు వెళ్లి తన ఫోన్లో రాధ (Radha) నెంబర్ స్వీట్ హార్ట్ అని సేవ్ చేసుకొని.. ఈ నెంబర్ నా దగ్గర ఉంది అని అనుకుంటాడు. ఇదే కాకుండా నీ ఫోన్ ట్రాప్ చేయించాను అని నువ్వు ఏది మాట్లాడినా నాకు తెలిసిపోతుంది అని అనుకుంటాడు.
 

26

మరోవైపు ఆదిత్య (Adithya) తన కూతురు గురించి తలుచుకుంటూ తనకు దూరంగా ఉన్నాను అని బాధపడతాడు. తనకు దూరంగా ఉన్న తన బాధ్యతలు చూసుకుంటాను అని ఎలాగైన దేవిని (Devi) కలెక్టర్ చేయాలి అని అందుకు తనను ఇంకా మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటాడు. దాంతో ఇప్పటికి ఫోన్ చేసి చెబుతాడు.
 

36

ఇక మాధవ ఫోన్ ట్రాప్ చేయడంతో పక్కనే ఉన్న దేవి (Devi) కి ఇంపార్టెంట్ కాల్ అని సైలెంట్ గా ఉండమని చెప్పి రాధ, ఆదిత్య మాటలు వింటాడు. ఆదిత్య దేవిని పెద్ద స్కూల్లో వెయ్యాలి అని అనటంతో ఆ మాట విని మాధవ షాక్ అవుతాడు. ఆదిత్య తీసుకుని నిర్ణయంతో రాధ సంతోషపడుతుంది. మాధవ (Madhava) తన మనసులో ఆదిత్య దేవిని దగ్గర చేసుకోవడానికి ఇలా ప్లాన్ చేస్తున్నాడు అని అనుకుంటాడు.
 

46

ఆ తర్వాత దేవి (Devi) తన తల్లి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాలు అన్ని చెబుతుంది. అప్పుడే మాధవ (Madhava) నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అంటూ ఒకచోట కి వెళ్ళాలి అని దేవిని లోపలికి పంపిస్తాడు. అలా మరుసటి రోజే మాధవ దేవిని ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరలో జాయిన్ చేస్తాడు. ఇందులో చదివితే కలెక్టర్లు అవుతారు అని అంటాడు. దాంతో దేవి సంతోషపడుతుంది.
 

56

ఆ తర్వాత రాధ (Radha) గుడికి వాయనం తీసుకుని వెళుతుంది. అక్కడున్న పూజారికి గతంలో తనకు వాయనం ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేస్తుంది. ఇక తనకు వాయనం ఇచ్చిన ఆవిడకు తాను కూడా తిరిగి వాయనం ఇస్తున్నాను అని చెప్పడంతో ఆ పూజారి సంతోషపడతాడు. అంతే కాకుండా ఆమె పదికాలాలు  పాటు చల్లగా ఉండాలి అని వేడుకుంటుంది.
 

66

ఇక వెంటనే ఆ పూజారి దేవుడమ్మ (Devudamma) కు ఫోన్ చేసి గుడికి పిలిపిస్తాడు. ఆ తర్వాత దేవుడమ్మకు పూజారి జరిగిన విషయం చెప్పడంతో దేవుడమ్మ సంతోషపడుతుంది. కానీ ఆ వాయనం ఇచ్చింది తన కోడలు రుక్మిణి అని అనుమాన పడుతుంది. ఆ తర్వాత రుక్మిణి తో పిల్లలు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే దేవి (Devi) తన తండ్రి తనను ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాడు అని చెబుతుంది.

click me!

Recommended Stories