టాలీవుడ్ క్రేజీ కపుల్ రాంచరణ్, ఉపాసన అన్యోన్యంగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కపుల్ కి వివాహమై పదేళ్లు గడుస్తోంది. రాంచరణ్, ఉపాసన వివాహం 2012లో వైభవంగా జరిగింది. రాంచరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.