Devatha: రాధనే సొంత తల్లి అని తెలుసుకున్న దేవి.. మాధవ వల్ల కష్టాలు పడుతున్న రుక్మిణి!

Published : Jun 03, 2022, 12:42 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత (Devatha) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రేటింగ్ లో కూడా పరవాలేదు అన్నట్లుగా దూసుకుపోతుంది. ఇక ఈ రోజు జూన్ 3వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
17
Devatha: రాధనే సొంత తల్లి అని తెలుసుకున్న దేవి.. మాధవ వల్ల కష్టాలు పడుతున్న రుక్మిణి!

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జానకి (Janaki) ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. రాధ (Radha) తాను ఉండగా పని చేయడం ఎందుకని అడగటంతో.. అందరూ నీలా ఉండరు అని ఈ ఇంటికి వచ్చే కోడలు ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకే ఇప్పటి నుండి చేస్తాను అని అంటుంది. అంతేకాకుండా ఊర్లో వాళ్లంతా నిన్నే ఈ ఇంటి కోడలిగా అనుకుంటున్నారని అంటుంది.
 

27

ఇక మాధవ (Madhava) రాధ ఫోటోలు చూస్తూ ఉంటాడు. ఇక రాధ (Radha) అక్కడికి వచ్చి ఇన్ని రోజులు మీతో బాధలు భరిస్తున్నాను.. ఇప్పుడు మీ అమ్మానాన్నలు కూడా తయారయ్యారని అంటుంది. ఆ మాటలు వింటున్న మాధవ ఊరి ప్రజలంతా నిన్ను ఈ ఇంటి కోడలిగా అనుకుంటున్నారని అంటాడు.
 

37

పిల్లల కోసం నిన్ను వదులుకునేది లేదు అని.. ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనటంతో రాధ (Radha) కోపంతో రగిలిపోతుంది. ఇప్పటి వరకు నీ భర్త ముందు మన పెళ్లి కాలేదన్న విషయం కూడా బయట పెట్టలేదు అని.. నీకు ఈ ఇల్లు తప్ప మరో దారి లేదు అని అంటాడు మాధవ (Madhava).
 

47

ఇక రాధ (Radha) కూడా గట్టిగా మాట్లాడుతుంది. ఈ ఇంటికి చిన్మయి కోసం వచ్చాను అని నా బిడ్డ తో పాటు తనకు కూడా పాలు ఇచ్చాను అనడం తో అప్పుడే అక్కడికి వచ్చిన దేవి (Devi) ఆ మాటలు వింటుంది. ఇక తన తల్లి రాధనే అని అనుకుంటుంది.
 

57

ఆదిత్య (Adithya) వాళ్ళ ఇంటికి వాళ్ళ మేనత్త వచ్చి బాగా హడావుడి చేస్తుంది. అంతేకాకుండా అక్కడున్న వారిపై అరుస్తూ ఉంటుంది. ఇక దేవుడమ్మను (Devudamma), ఆదిత్యను పిలుస్తుంది. కమల, భాషను వాళ్ళను చూసి ఎవరు అంటూ.. ఎందుకు ఉన్నారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది.
 

67

సత్య (Sathya) వాళ్ల అక్క అని ఎంత చెల్లెలు అయితే ఇక్కడ ఉండాలా అని అంటుంది. ఇక సత్య, ఆదిత్య రావటంతో ఆదిత్య (Adithya) ఆమెను పలకరించి బయటికి వెళ్తాడు. సత్య ను పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది అని ఈ పాటికే ఇద్దరు పిల్లల తల్లి కావాలి అంటూ పిల్లలు ఎక్కడ అనటంతో సత్య బాధపడుతుంది.
 

77

మరో వైపు రాధ (Radha) దగ్గరికి దేవి (Devi) వెళ్లి గట్టిగా పట్టుకుంటుంది. నిన్ను బాధ పెట్టాను అని సారీ చెబుతుంది. తనకు ఆఫీసర్ సారు చెప్పిన మాటలను, తాను విన్న మాటలను చెబుతుంది. దాంతో రాధ ఇప్పటికైనా తన కూతురుకి నిజం తెలిసింది అని సంతోషపడుతుంది.

click me!

Recommended Stories