అభిమాన హీరోలతో సినిమా తీసిన డైరెక్టర్స్.. ఒకప్పుడు ఫ్యాన్స్.. ఇప్పుడు ఫేమస్ ఫిల్మ్ మేకర్స్..

Published : Jun 03, 2022, 11:38 AM ISTUpdated : Jun 03, 2022, 12:07 PM IST

తమ అభిమాన హీరోల కోసం ఏం చేయడానికైనా ఫ్యాన్స్ వెనకాడరు. కొందరు సినిమాను హిట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. మరికొందరు అభిమాన హీరో కోసం సేవా కార్యక్రమాలూ  చేస్తారు. కానీ వీళ్లు మాత్రం తాము ఎంతగానో ఇష్టపడే హీరోలతోనే సినిమా తీసేశారు. వీళ్లు ఎవరు ఏంటనే విషయాలు తెలుసుకుందాం..    

PREV
17
అభిమాన హీరోలతో సినిమా తీసిన డైరెక్టర్స్.. ఒకప్పుడు ఫ్యాన్స్.. ఇప్పుడు ఫేమస్ ఫిల్మ్ మేకర్స్..

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్ ల అభిమానుల  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970 నుంచే వీరి సినీ కేరీర్ ప్రారంభం కాగా.. ఇప్పటికీ భారీ చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. కాగా వీరి సినిమాలు చూసి అభిమానులుగా మారిన వారు కోట్లల్లో ఉంటారనే విషయం తెలిసిందే. కానీ ఆ అభిమానులే తమ సినిమాలను డైరెక్ట్ చేయడం నిజంగా గొప్ప విషయమే. 

27

యంగ్  డైరెక్టర్ లోకేష్ కనగరాజు (Lokesh Kanagaraj) తమిళ ఇండస్ట్రీలో ఎంతగానో అభిమానించే హీరోలు కమల్ హాసన్, విజయ్, రజినీకాంత్. వారి సినిమాలు చూసే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. దీంతో యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan)తో సినిమా తీయాలనే కోరికను ‘విక్రమ్’తో నెరవేర్చుకున్నాడు. ఈ మూవీ జూన్ 3( ఈరోజు)న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. నాలుగేండ్ల తర్వాత కమల్  హాసన్ బిగ్ స్క్రీన్ పై కనబడటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. లోకేశ్ విజయ్ తోనూ గతంలో ‘మాస్టర్’తీయగా.. త్వరలో ‘విజయ్ 67’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
 

37

చెన్నైకి చెందిన టాలెంటెడ్ డైరెక్టర్ పా రంజిత్ (Pa Ranjith) మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించి  తన మార్క్ చూపిస్తున్నాడు. ఈయన కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని. ఒకప్పుడు ఫ్యాన్స్ గా ఉన్న ఈయన తలైవాతో ‘కబాలి’, ‘కాలా’ చిత్రాలను రూపొందించి ఫేమస్ ఫిల్మ్ మేకర్ గా మారాడు.  ఇటీవల  హిస్టారికల్ స్పోర్ట్స్ డ్రామాను నటుడు ఆర్యతో తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. 
 

47

దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమర్ (Nelson Dilipkumar) ఫేమస్ డైరెక్టర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో పేరొందాడు. ఈయన కేరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే డైరెక్టర్ గా మారాడు. నెల్సన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని. ఎప్పటికైనా ఆయనతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల ‘బీస్ట్’తో అలరించిన నెల్సన్ త్వరలో ‘తలైవా 169’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అభిమాన హీరోతో సినిమా తీసే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. 
 

57

తన ప్రతి సినిమాను చాలా కొత్తగానూ, భిన్నంగానూ చూపించేందుకు ఇష్టపడుతాడు  దర్శకుడు, రైటర్ కార్తీక్ సుబ్బరాజ్. ఈయన కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని. ఒక అభిమాని తన హీరోను ఎలా చూసుకోవాలనుకుంటాడో.. అదే కోణంలో రజినీని ‘పేట’ చిత్రంలో చూపించాడు. బలమైన కథతో అభిమాన హీరోతో సినిమా తీసి తన కళ నెరవేర్చుకున్నాడు.  తొలిసారిగా రామచరణ్ నటిస్తున్న ‘ఆర్సీ15’కి కథ అందించాడు కార్తీక్.
 

67

ఇక, టాలీవుడ్ లో ఇటీవల కాలంలో డైరెక్టర్ పరుశురామ్ పెట్ల కూడా తన అభిమాన హీరోతో సినిమా తీసేశాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే తను ఎంతో అభిమానమని పరుశురామ్ చాలా సార్లు చెప్పాడు. మహేశ్ బాబు ‘ఒక్కడు’ సినిమా చూసి ఇండస్ట్రీకి వచ్చినట్టు ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. చివరికి ‘సర్కారు వారి పాట’తో తన అభిమాన హీరోతో సినిమా తీసి.. ఆడియెన్స్ తో విజిల్స్ వేయించాడు.  


 

77

మరో టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. చిరు సినిమాలు చూస్తూ పెరిగిన వెంకీ త్వరలో చిరుతోనే ‘మెగా156’ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. స్వయంగా చిరునే తన అభిమాని డైరెక్షన్ లో నటించడం సంతోషంగా ఉందని తెలిపారు. వెంకీ కుడుముల ‘తుఫాన్, ఛలో, బీష్మ’సినిమాలతో తన మార్క్ చూపించాడు.

click me!

Recommended Stories