ఎపిసోడ్ ప్రారంభంలో మా కంపెనీ ఇప్పటివరకు ఎవరి దగ్గర రూపాయి దొంగతనం చేయలేదు, నమ్మకంతోనే మా కంపెనీ రన్ అవుతుంది అంటాడు ఆర్య. మరి మీ మీద వచ్చిన ఆరోపణలకి ఏం సమాధానం చెప్తారు అంటాడు జడ్జ్. మా అభివృద్ధిని చూడలేని కొందరు స్వార్థపరులు మా మీద ఫ్రాడ్ కేసులు వేశారు అంటాడు ఆర్య. ఆ డొల్ల కంపెనీలకి మీకు ఏ సంబంధం లేదా అని అడుగుతాడు జడ్జ్. లేదని చెప్తాడు ఆర్య. ఉంది యువరానర్ అందుకు తగిన సాక్షాలు నా దగ్గర ఉన్నాయి అంటూ పీపీ తన వాదన మొదలు పెడతాడు. నమ్మకం గురించి చాలా ఎక్కువగా ఉపన్యాసం ఇచ్చారు అదే నమ్మకంతో జనాలని ముంచేశారు.