పట్టు చీరల్లో నిండు చందమామ, మెస్మరైజ్ చేస్తున్న శ్రీయా శరణ్ క్లాసిక్ లుక్స్..

Published : Apr 24, 2023, 07:07 AM IST

రొటీన్ కు భిన్నంగా కనిపించింది స్టార్ సీనియర్ హీరోయిన్ శ్రీయా శరణ్. ఎప్పుడూ అందాలు ఆరబోస్తూ.. పొట్టి పొట్టి డ్రస్సుల్లో కనిపించే బ్యూటీ.. ఈసారి మాత్రం దేవకన్యలా మెరిసిపోయింది. పట్టు బట్టల్లో అదరగొట్టింది.   

PREV
17
పట్టు చీరల్లో నిండు చందమామ, మెస్మరైజ్ చేస్తున్న శ్రీయా శరణ్ క్లాసిక్ లుక్స్..

అవును కబ్జా మూవీలో రాయల్ లుక్ లో శ్రీయా శరణ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పట్టు బట్టల్లో..ఓల్డ్ క్లాసిక్ లుక్ లో శ్రీయా అద్భతం లా ఉంది. ఈఫోటోస్ ను అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసింది. కబ్జా మూవీ అమెజాన్ లో స్ట్రీమింగ్ అయ్యి ఉండటంతో.. ప్రమోషన్ కోసం ఇవి రిలీజ్ చేశారు టీమ్. 
 

27

ఈఫోటోస్ లో శ్రీయా శరణ్ హుందాగా కనిపించారు. ఒకప్పటి జమిందారుల ఇంటి ఇల్లాలి గ్రాండ్ నెస్ కనిపిస్తుంది ఫోటోస్ లో. ఈ ఫోటోస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంతే కాదు కబ్జా మూవీపై ఇంట్రెస్ట్ ను పెంచేలా ఉన్నాయి ఫోటోస్. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

37

40 ఏళ్ళు వచ్చినా ఏమాత్రం అందం తగ్గలేదు శ్రీయా శరణ్. ఇంకా రెట్టింపు అందంతో రెచ్చిపోతోంది బ్యూటీ. పెళ్ళై.. ఓ పాపకు జన్మను ఇచ్చినా.. శ్రీయా మాత్రం అందం విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఫిట్ నెస్ విషయంలో కూడా ఏమాత్రం రాజీపడటంలేదు. 
 

47

ఇక సినిమా ఆఫర్లు కూడా శ్రీయా శరణ్ అందాలుక తగినట్టుగానే వస్తున్నాయి. ఇప్పటికీ సీనియర్ హీరోల సరసన జంటగానే నటిస్తుంది కాని.. ఇప్పటి వరకూ.. ఇతర హీరోయిన్ల మాదిరి.. అక్క,వదినా, అమ్మ పాత్రలవైపు టర్న్ అవ్వలేదు శ్రీయా. మంచి మంచి పాత్రలు ఆమెను వరిస్తూ వస్తున్నాయి. 

57

ఇక సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. శ్రీయాకు భారీగా ఇన్ స్టా ఫాలోవర్స్ ఉన్నారు. వారు రోజు రోజుకు పెరుగుతున్నారే తప్ప తరగడంలేదు. శ్రీయా కూడా అభిమానులు ఆనంద పడేలా.. అద్భుతమైన ఫోటో షూట్లతో... అందాల విందు చేస్తూనే ఉంటుంది. ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తుంటుంది. 
 

67

ఇక తాజా సమాచారం ప్రకారం శ్రీయా రెండు దశాబ్దాల  తరువాత మెగాస్టార్ చిరంజీవితో నటించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో.. మెగాస్టార్ తో కలిసి ఠాగూర్ సినిమాలో నటించింది బ్యూటీ.. మళ్ళీ ఈ ఇద్దరు తెరమీద కనిపించలేదు. ఠాగూర్ సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ప్రస్తుతం మెగాస్టార్ మోహర్ రమేష్ డైరెక్షన్ లో బోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాతో శ్రీయా ఐటమ్ సాంగ్  చేయబోతోందట. 
 

77

ఠాగూర్ సినిమాలో చిరంజీవి కి పోటీ పడి మరీ డాన్స్ స్టెప్పులతో అలరించింది శ్రీయా. ఇక ఈసారి కూడా ఐటమ్ సాంగ్ చేయనుండటంతో మెగాస్టార్ తో ఎలా డాన్స్ చేస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అంతే కాదు ఈపాట కోసం కోటి రెమ్యునరేషన్ కూడా తీసుకోబోతుందట శ్రీయా. మరి ఇది ఎంత వరకూ నిజమో చూడాలి. ఇప్పటికే చాలా సినిమాల్లో అద్భుతమైన ఐటమ్ సాంగ్స్ తో అలరించింది బ్యూటీ. 
 

click me!

Recommended Stories