ఏప్రిల్ 28న ఈ పీఎస్2 రిలీజ్ అవుతుండడంతో చిత్ర యూనిట్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు హైదరాబాద్ లో పీఎస్ 2 ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మణిరత్నం, కార్తీ, జయం రవి, విక్రమ్, శోభిత, త్రిష అలాగే ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ హాజరయ్యారు.