ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో ఇండియా వైడ్ గా బాగా పాపులర్ అయ్యాడు రాజ్. తెలుగు, హిందీ భాషల్లో కొన్ని సినిమాలకు రైటర్ గా పనిచేశారు. మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మించారు. ప్రస్తుతం పూర్తిగా వెబ్ సిరీస్ ల పై ఫోకస్ చేశారు రాజ్. ఈక్రమంలో ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ నుంచి సమంతతో రాజ్ కు పరిచయం ఏర్పడింది. రాజ్ నిడిమోరు, సమంతతో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఫోటోలు వైరల్ అవుతుండటంతో సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది వారు రాసుకుంటున్నారు. అయితే వీరిద్దరు మాత్రం డేటింగ్ వార్తలపై ఇంత వరకూ స్పందించలేదు.