టాలీవుడ్ లో యువ దర్శకుల హవా మొదలయ్యింది. నాగ్ అశ్విన్, ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. మరికొందరు యువ దర్శకులు ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో ఎదుగుతున్నారు. ఒక్కో దర్శకుడికి ఒక్కో జోనర్ లో స్పెషాలిటీ ఉంటుంది. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మ్యాడ్ చిత్రంతో టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు.