kushi movie
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన `ఖుషి` సినిమా అప్పట్లో ఎంతటి పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. యువతని ఓ ఊపు ఊపేసింది. ఆ తరాన్ని బాగా ప్రభావితం చేసిన మూవీ అది. ఇందులో పవన్‌కి జోడీగా భూమిక హీరోయిన్‌గా నటించగా, ఎస్ జే సూర్య దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ క్రేజ్‌ని, ఇమేజ్‌న అమాంతం పెంచేసిన మూవీ ఇది.
Veera Dheera Sooran censoring done chiyaan vikram
అయితే ఈ మూవీ తమిళంలో వచ్చిన `ఖుషి`కి రీమేక్. అందులో విజయ్, జ్యోతిక నటించగా, ఎస్ జే సూర్య దర్శకత్వం వహించారు. తమిళంలో భారీ విజయం సాధించడంతో తెలుగులో రీమేక్ చేశారు. తమిళంలో కంటే తెలుగులోనే ఇది పెద్ద విజయం సాధించిందని, పవన్ కళ్యాణ్ సినిమా రేంజ్‌ని పెంచేశాడని ఓ సందర్భంలో ఆయన అన్నారు.
తాజాగా `ఖుషి` సమయంలో తాను ఫేస్ చేసి స్ట్రగుల్ గురించి, ఆ టెన్షన్ గురించి వెల్లడించారు ఎస్ జే సూర్య. తాజాగా ఆయన `వీర ధీర శూర` చిత్రంలో ముఖ్య పాత్ర పోషించారు. విక్రమ్ హీరోగా నటించిన మూవీ ఇది. ఈ నెల 27న ఇది విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో టీమ్ సందడి చేసింది.
sj suryah
ఇందులో ఎస్ జే సూర్య సినిమా విశేషాలను పంచుకున్నారు. విక్రమ్ నటన గురించి, దర్శకుడి డెడికేషన్ గురించి తెలిపారు. ఈ క్రమంలో ఆయనకు మళ్లీ డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకి సూర్య స్పందిస్తూ డైరెక్షన్ చేయడం అంత ఈజీ కాదని తెలిపారు.
ఒక కథ రాయడానికి ఆరు నెలలు కూర్చోవాలని, స్క్రిప్ట్ బాగా రావడం కోసం స్ట్రగుల్ అవ్వాలని, ఆ తర్వాత టీమ్‌ని సెట్ చేసుకోవడం మరో పెద్ద టాస్క్ అని, షూటింగ్ ఇంకో పెద్ద సవాల్‌తో కూడినది అన్నారు. సినిమాలో డైరెక్టరే అన్నీ చేయాల్సి వస్తుందన్నారు.
kushi movie
సినిమా అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో చుక్కలు చూడాల్సి వస్తుందని, ఫైనల్ కాపీ రెడీ అయ్యేంత వరకు చుక్కలు కనిపిస్తాయి. ఇక అన్నీ అయిపోయాక రిలీజ్ టైమ్‌లో నరకం కనిపిస్తుందని, మధ్యలో ఏమాత్రం కాన్ఫిడెన్స్ తగ్గినా రిజల్ట్ తేడా కొడుతుంది. షూటింగ్ దశలోనే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు.
అన్ని రకాల ఫ్రస్టేషన్స్ తట్టుకుని, దిగమింగి షూట్ చేయాల్సి వస్తుంది. చివరికి రిలీజ్ రోజు వరకు సినిమా ఎలా వస్తుందో, ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనే టెన్షన్‌తో చచ్చిపోవాల్సి వస్తుంది. రిలీజ్ ముందు రోజు నుంచి ఈ టెన్షన్ పీక్‌లో ఉంటుంది. వాటిని తట్టుకుని సినిమాకి పాజిటివ్ వస్తే అది గ్రేట్ ఫీలింగ్ అని తెలిపారు.
అప్పుడు కష్టం మొత్తం మర్చిపోతామని, కానీ రిలీజ్‌కి నెల రోజులు పడే స్ట్రగుల్స్ ఉంటాయో దాన్ని మాటల్లో చెప్పలేమని, దర్శకుడికి ఇచ్చే పారితోషికం ఆ రోజుల్లో పడే స్ట్రగుల్స్ కే ఇవ్వాలన్నాడు సూర్య.
kushi, suryah
ఈ సందర్భంగా `ఖుషి` (తమిళం) సినిమా ప్రీమియర్స్ రోజు అనుభవాలను పంచుకున్నారు. ఆ రోజు చెన్నైలో ఇండస్ట్రీకి చెందిన పెద్దలు చాలా మందికి సినిమా షో వేశారు. అంతా సీరియస్‌గా మూవీని చూస్తున్నారు. ఎవరూ నవ్వడం లేదు, ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదు.
అదేదో స్మశాన వాటికలో ఉండి దీనంగా సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. వాళ్లని చూస్తుంటే తనకు చెమటలు పట్టాయని, అయితే నెక్ట్స్ డే ఆడియెన్స్ ముందుకు వచ్చేసరికి సీన్ అంతా మారిపోయిందని, వాళ్లు బాగా ఎంజాయ్ చేయడం చూసి నమ్మకం ఏర్పడిందని, అప్పటి వరకు ఆ బాధని మాటల్లో చెప్పలేనని వెల్లడించారు.
read more: Jana Nayagan OTT Rights: విజయ్ `జన నాయగన్` ఓటీటీ, థియేట్రికల్ రైట్స్ హాట్ కేక్.. ఎంతకి అమ్మిరంటే?