`మా` ఎన్నికల్లో అనసూయ, సుడిగాలి సుధీర్‌.. `జబర్దస్త్` టీమ్‌ ఎంట్రీతో రంజుగా ఎన్నికలు.. గెలుపు ఖాయమేనా?

`మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌`(మా) ఎన్నికల్లో పోటీలు ఈ సారి `జబర్దస్త్` టీమ్‌ నుంచి అనసూయ, సుడిగాలి సుధీర్‌ కూడా దిగుతున్నారు. దీంతో ఎన్నికలు మరింత రంజుగా తయారయ్యాయి. అంతేకాదు తాజా లెక్కల ప్రకారం గెలుపు ఖాయమైనట్టే ఉంది.
 

jabardasth artists anasuya sudigali sudheer creat new buzz in maa elections  arj
`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో పోటీలో ఉన్నారు. అనసూయతోపాటు సుడిగాలి సుధీర్‌ ప్యానెల్‌ సభ్యుల కోసం పోటీ పడుతున్నారు. దీంతో టీవీలో వీరికున్న క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోబోతున్నారని చెప్పొచ్చు. టీవీలో ఉన్న చాలా మంది `మా`లో సభ్యులుగా ఉన్నారు. అదంతా ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌కి కలిసొచ్చేలా ఉంది.
jabardasth artists anasuya sudigali sudheer creat new buzz in maa elections  arj
ప్రకాష్‌ రాజ్‌ ప్రకటించిన ప్యానెల్‌లో అనసూయ, సుడిగాలి సుధీర్‌ ఉండటంతో `మా` ఎన్నికలు మరింతగా రంజుగా మారాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టీవీలో వీరికి మంచి క్రేజ్‌ ఉన్నా, సినిమాల్లోకి వచ్చేసరికి అది ఏ మాత్రం పనిచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి `మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌` ఎన్నికలు మరింతగా రసవత్తరంగా మారాయి. ఇంకా ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాలేదు. అప్పుడే నలుగురు అధ్యక్ష పీఠం కోసం బరిలోకి దిగబోతున్నట్టు ప్రకటించారు. ప్రకాష్‌ రాజ్‌ ముందే, ప్రకటించగా, ఆ తర్వాత మంచు విష్ణు, ఆ వెంటనే జీవితా రాజశేఖర్‌, మరోవైపు నటి హేమ సైతం తాను అధ్యక్ష ఎన్నికల్లో నిలవబోతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు `మా` ఎన్నికలు నాలుగు కుర్చీలాటగా మారింది.
ప్రకాష్‌ రాజ్‌ అన్నింటిలోనూ ముందే ఉన్నారు. ముందుగానే తాను అధ్యక్ష బరిలో ఉన్నట్టు ప్రకటించడమే కాదు, తన ప్యానెల్‌ని కూడా ప్రకటించారు. మరోవైపు ఏకంగా ఈ రోజు(శుక్రవారం) ప్రెస్‌మీట్‌ పెట్టి అనేక సందేహాలను నివృతి చేశారు. అదే సమయంలో తన బలప్రదర్శన కూడా చేశాడు. తనకు ఎవరు మద్దతు ఇస్తున్నారో పరోక్షంగా ప్రకటించారు.
నాగబాబు పెద్దగా హాజరై తన మద్దతు ప్రకాష్‌ రాజ్‌కే అని చెప్పాడు. తాను గతంలో చేసిన సేవా కార్యక్రమాలు నచ్చి ఆయనకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు చిరంజీవి ఆశీస్సులు కూడా ప్రకాష్‌రాజ్‌కే అని స్పష్టం చేశారు. మెగా ఫ్యామిలీతోపాటు నాగార్జున, ఎన్టీఆర్‌ వర్గాలు కూడా ప్రకాష్‌ రాజ్‌ వైపే మొగ్గు చూపేలా ఉన్నాయి.
దీనికితోడు ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌లో 90శాతం సభ్యులు `మా`లో చాలా యాక్టివ్‌గా ఉన్నవాళ్లే. `మా` గురించి, మా ఎన్నికల అనుభావాలు కలిగిన వారున్నారు. శ్రీకాంత్‌, సాయికుమార్‌, జయసుధ, ఉత్తేజ్‌, బ్రహ్మాజీ, అజయ్‌, నాగినీడు, బెనర్జీ, ఏడిద శ్రీరామ్‌, తనీష్‌, అనితా చౌదరి వంటివారితోపాటు బండ్ల గణేష్‌ కూడా ఉన్నారు. ఈ లెక్కన పవన్ కళ్యాణ్‌ నుంచి కూడా ప్రకాష్‌ రాజ్‌కి సపోర్ట్ దొరికినట్టే అంటున్నారు.
ప్రభాస్‌, మహేష్‌, బాలకృష్ణ, వెంకటేష్‌ వంటి వారు ఎవరికి సపోర్ట్ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. మంచు విష్ణుకి మహేష్‌తో మంచి అనుబంధం ఉంది. అందుకే కృష్ణని కలిశారని అంటున్నారు. కృష్ణంరాజు కూడా మంచు విష్ణుకి సపోర్ట్ చేశారని అంటున్నారు. కానీ వీరు `మా` సభ్యులను ఎంత మేరకు ప్రభావితం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
అదే సమయంలో ఈ ఎన్నికల్లో జీవితా రాజశేఖర్‌, హేమ వర్గాలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అనే టాక్‌ కూడా వినిపిస్తుంది. గత `మా`లో రాజశేఖర్‌ చేసిన వివాదం హాట్‌ టాపిక్‌గా మారింది. నరేష్‌పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో అది జీవితపై ప్రభావం పడే అవకాశం ఉంది.
అయితే జీవిత, హేమలు ఓట్లు చీల్చే అవకాశాలున్నాయి. వీరి ఏ వర్గం ఓట్లు చీల్చుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ప్రకాష్‌ రాజ్‌ ప్యానెక్ట్ కి గెలుపు సూచనలు కనిపిస్తున్నాయని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే మంచు విష్ణు, జీవిత, హేమలు తమ ప్యానెన్లని ప్రకటిస్తే అసలు విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఏదేమైనా `జబర్దస్త్` ఆర్టిస్టులు అనసూయ, సుధీర్‌లు మా ఎలక్షన్లో నిలబడటంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో దీని గురించిన చర్చ మొదలైంది.

Latest Videos

vuukle one pixel image
click me!