చిరంజీవి & పూరి: ఓ గమ్మత్తైన టైటిల్, అసలు ఊహించం

Published : Dec 10, 2024, 04:33 PM IST

చిరంజీవి మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో సినిమా గురించి చాలాసార్లు చర్చలు జరిగాయి. అయితే, ఆ ప్రాజెక్ట్ ఎందుకు ముందుకు సాగలేదనే దానిపై పలు కారణాలు ఉన్నాయి.

PREV
16
చిరంజీవి & పూరి:  ఓ గమ్మత్తైన టైటిల్, అసలు ఊహించం
Puri jagannath, Chiranjeevi, pokiri

పూరి జగన్నాథ్,  చిరంజీవి కాంబినేషన్‌లో సినిమా గురించి అనేక సార్లు చర్చలు జరిగాయి. చిరంజీవి అంటే పూరి జగన్నాథ్ కు చాలా ఇష్టం. దాంతో తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవితో పూరి సినిమా చేయాలని ఆశపడ్డారు.

రెండు మూడు సార్లు ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. పూరి స్పెషల్ గా డిజైన్ చేసే క్యారక్టరైజేషన్, డైలాగులు కూడా చిరంజీవికు చాలా ఇష్టం. పిలిచి తనతో సినిమా చేయమని చెప్పారు కానీ రకరకాల కారణాలతో ముందుకు వెళ్లలేదు. అప్పుడు ఈ కాంబినేషన్ కు అనుకున్న టైటిల్ ఇప్పటికి ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటూ ఉంటారు. 
 

  

26


మరీ ముఖ్యంగా ఆంధ్రావాలా డిజాస్టర్ టైమ్ కు లో ఎలాగైనా ఓ కథను చెప్పి ఒప్పించాలనుకున్నారు. అప్పటికి నాలుగు సూపర్ హిట్స్ తన వెనుక ఉన్నాయి. కానీ ఆంద్రావాలా డిజాస్టర్ ఒక కుదుపు కుదిపేసింది. అప్పటికే చిరంజీవి తో పూరి సినిమా గురించి చాలా చర్చలు, మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి.

అప్పటికే చిరంజీవికు చెప్పటానికి మూడు స్టోరీ లైన్స్ ని రెడీ చేసుకున్నారు పూరి. అందులో ఒక దాన్ని ఫైనలైజ్ చేసి కథ నేరేట్ చేద్దామనుకున్నారు. అందుకోసం ఓ టైటిల్ కూడా ఫైనల్ చేసుకున్నారు. ఆ టైటిల్ గమ్మత్తుగా ఉంటుంది.

36


ఇంతకీ చిరంజీవి కోసం పూరి రెడీ చేసిన టైటిల్ ఏంటంటే.....శ్రీకృష్ణుడు ఫ్రమ్ సురభి కంపెనీ. ఫన్, యాక్షన్ కలిసిన కథ అది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాదని నమ్మారు. టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ మాస్ డైరెక్టర్ గా ఒక్క ప్రత్యేకమైన స్థానం ని ఏర్పరచుకోవాలనుకున్నారు పూరి జగన్నాథ్.

చిరంజీవికు వినిపించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుని షూటింగ్ మొదలెట్టాలి. అయితే చాలా టైమ్ పట్టేటట్లు ఉంది. చిరంజీవి ఫామ్ లో ఉన్నారు. వరస ప్రాజెక్టులు ఉన్నాయి. కలుస్తున్నారు కానీ కుదరటం లేదు. బాగా లేటయ్యేలాగ ఉందని దాన్ని ప్రక్కన పెట్టేసారు. అప్పుడు చేసిందే పోకిరి, మహేష్ ని కలిసి వేరే కథ చెప్పి ఒప్పించారు. మహేష్ తో సూపర్ హిట్ ఇచ్చి ఆ తర్వాత చిరంజీవి తో చేద్దామని ఆలోచన. కానీ ఆది జరగలేదు. 

46


ఆ తర్వాత చిరంజీవి తన 150వ సినిమాకు పూరిని డైరెక్టర్‌గా ఎంపిక చేస్తారనే  వార్తలు వచ్చాయి. అయితే, ఆ ప్రాజెక్ట్ ఎందుకు ముందుకు సాగలేదనే దానిపై పలు కారణాలు వినిపించాయి:
అందుకు ముఖ్య కారణం...కథలో విభేదాలు అంటారు.  చిరంజీవి, పూరి ఇద్దరూ తమదైన స్టైల్లో పనిచేసే వ్యక్తులు. కథ విషయంలో వారి అభిప్రాయాలు కలవకపోవడం ఒక కారణంగా చెబుతారు.

56


 చిరంజీవి తన రీ ఎంట్రీకి చాలా కేర్ తీసుకున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా "ఖైదీ నంబర్ 150" అనే సినిమాను వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో చేయాలని నిర్ణయించారు. మరో ప్రక్క  పూరి జగన్నాథ్ షెడ్యూల్ సమస్యలు వచ్చాయి..

పూరి తన సినిమాలను వేగంగా పూర్తి చేయగలడు, కానీ చిరంజీవి వంటి పెద్ద స్టార్‌తో పని చేయాలంటే కాస్త ఎక్కువ సమయం అవసరం. ఈ విషయంలో షెడ్యూల్ ఇబ్బందులు ఎదురయ్యి ఉంటాయంటారు. 

66


ఆ తర్వాత ఆటో జాని టైటిల్ తో చిరంజీవితో ఓ సినిమా అనుకున్నారు. అయితే  ఆ ప్రాజెక్ట్స్ కూడా మెటీరలైజ్ కాలేదు.  ఆ సమయంలో వచ్చిన ఇతర ఆఫర్లు లేదా బిజినెస్ రీజన్స్  కూడా ప్రభావం చూపించాయి.  అయితే, చిరంజీవి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఒక ప్రత్యేకమైన క్రేజును సృష్టించగలిగే అవకాశం ఉంది, కాబట్టి భవిష్యత్తులో ఈ కలయిక మళ్లీ ప్రట్టాలు ఎక్కితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

click me!

Recommended Stories