గుడ్ బై చెప్పనున్న కృతి శెట్టి... ఫ్యాన్స్ గుండె బద్దలయ్యే వార్త!

First Published Jun 12, 2024, 8:16 AM IST

హీరోయిన్ కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులకు దూరం కానుందట. ఇకపై ఆమె టాలీవుడ్ లో కనిపించడం కష్టమే అంటున్నారు. అందుకు కారణాలు ఏమిటో చూద్దాం.. 
 

Kriti Shetty

ఉప్పెన మూవీతో సునామీలా దూసుకొచ్చింది కృతి శెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయం అవుతూ ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించాడు. 2021లో విడుదలైన ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అరంగేట్రంతోనే కృతి శెట్టి అదరగొట్టింది. 

Kriti shetty

ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ అయిన కృతి శెట్టి కి ఆఫర్స్ క్యూ కట్టాయి. శ్యామ్ సింగరాయ్ చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. 2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సైతం హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేసింది. దాంతో మరింతగా ఆమెకు అవకాశాలు పెరిగాయి. 

Kriti shetty

నాలుగో చిత్రం నుండి ఆమెకు ప్లాప్స్ మొదలయ్యాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీల పరిశ్రమకు వచ్చి దున్నేస్తుంది. శ్రీలీల నుండి ఆమెకు గట్టిపోటీ ఎదురైంది. 

Kriti shetty

టాలీవుడ్ ఇచ్చిన చివరి ఛాన్స్ కూడా ఆమెకు ఉపయోగించుకోలేకపోయింది. ఆమె లేటెస్ట్ రిలీజ్ మనమే బాక్సాఫీస్ వద్ద విఫలం చెందింది. శర్వానంద్-కృతి శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మనమే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. వీకెండ్ లో కూడా సరైన వసూళ్లు రాబట్టడంలో సినిమా ఫెయిల్ అయ్యింది. 

Kriti Shetty


మనమే సైతం ప్లాప్ అని తేలిపోయింది. ఇక కృతి శెట్టికి తెలుగులో ఆఫర్స్ లేవు. ఇకపై అవకాశాలు వచ్చే దాఖలాలు లేవు. ఈ క్రమంలో కృతి శెట్టి కెరీర్ తెలుగులో ముగిసినట్లే అన్న టాక్ వినిపిస్తుంది. ఇది ఒకింత ఆమె ఫ్యాన్స్ ని నిరాశ పరిచే అంశమే. విజయాలు లేకపోతే దర్శక నిర్మాతలు పట్టించుకోరన్న సంగతి తెలిసిందే.. 

Kriti Shetty

అయితే కృతి శెట్టి తమిళంలో బిజీ అవుతుంది. ఆమె చేతిలో ఏకంగా మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. అలాగే ఓ మలయాళ చిత్రం చేస్తుంది. మరి కోలీవుడ్ లో కృతి శెట్టి జర్నీ ఎలా సాగుతుందో చూడాలి... 

Latest Videos

click me!