ఇంతకీ ఈ మూడో ఎన్టీఆర్ ఎలా ఉంటాడు? మోక్షజ్ఞకు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్!

First Published Jun 12, 2024, 7:14 AM IST


నందమూరి ఫ్యామిలీకి చెందిన నయా ఎన్టీఆర్ ఎలా ఉంటాడనే ఉత్సుకత అందరిలో ఉంది. కాగా దర్శకుడు వైవీఎస్ చౌదరి అతన్ని దాచేశాడు. అయితే మోక్షజ్ఞ కంటే ముందు వస్తున్న ఈ ఎన్టీఆర్ బాలకృష్ణకు చెక్ పెడతాడనే వాదన మొదలైంది
 

నందమూరి కుటుంబం నుండి మరో హీరో వస్తున్న సంగతి తెలిసిందే. అతడి పేరు కూడా ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అని ఇప్పటికే నందమూరి కుటుంబంలో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉన్నారు. కొత్తగా మూడో ఎన్టీఆర్ వస్తున్నాడు. అయితే ఈ నయా ఎన్టీఆర్ ని ఇంకా పరిచయం చేయలేదు. అతన్ని దాచేస్తున్నారు. 
 

NTR

ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒక బ్రాండ్. సిల్వర్ స్క్రీన్ పై చరిత్ర సృష్టించిన పేరు అది. నందమూరి తారక రామారావు నెంబర్ వన్ హీరోగా దశాబ్దాలు చిత్ర పరిశ్రమను శాసించారు. ఆయన వారసులుగా వచ్చిన వాళ్లలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. స్టార్స్ గా ఎదిగారు.
 

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. నటన, డైలాగ్ డెలివరీలో తనకు సాటి లేదని నిరూపించుకున్నాడు. ఇక దేశంలోనే గొప్ప డాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకడు. అంచెలంచెలుగా ఎదుగుతూ ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

కాగా జూనియర్ ఎన్టీఆర్ అన్న కుమారుడు అదే పేరుతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం కాబోతున్నాడు. హరికృష్ణకు ముగ్గురు కుమారులు కాగా పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆయన కుమారుడే ఈ నయా ఎన్టీఆర్. అయితే అతడు ఎలా ఉంటాడో చూపించడం లేదు.

NTR

ఈ కొత్త ఎన్టీఆర్ ని దర్శకుడు వైవిఎస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఇటీవల పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ప్రెస్ మీట్ కి వైవిఎస్ చౌదరి మాత్రమే వచ్చాడు. యంగ్ ఎన్టీఆర్ రాలేదు. దాంతో నందమూరి లేటెస్ట్ వారసుడు ఎలా ఉంటాడనే ఉత్సుకత అందరిలో ఉంది. ఈ సస్పెన్సు ని మైంటైన్ చేయడానికే అతన్ని దాచి ఉంచారని తెలుస్తుంది.

NTR

మరోవైపు బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అటు మోక్షజ్ఞ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ అన్నయ్య కొడుకు నయా ఎన్టీఆర్ ఆల్రెడీ దిగిపోయాడు. ఒకవేళ హరికృష్ణ మనవడు కూడా సత్తా చాటిన నేపథ్యంలో బాలకృష్ణకు చెక్ పెట్టినట్లు అవుతుంది. అయితే ఈ కొత్త ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలని ఫ్యాన్స్ అతృతగా ఉన్నారు.

Latest Videos

click me!