మిస్టీరియస్‌ పర్సన్‌తో సురేఖ వాణి.. ఫోటో వైరల్‌.. ఎవరతను? ఎందుకు కలిసింది?

Published : Jun 11, 2024, 11:12 PM IST

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఇటీవల సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఆమె ఒక బాలీవుడ్‌ మిస్టీరియస్‌ పర్సన్‌తో కనిపించడం విశేషం.   

PREV
16
మిస్టీరియస్‌ పర్సన్‌తో సురేఖ వాణి.. ఫోటో వైరల్‌.. ఎవరతను? ఎందుకు కలిసింది?

సురేఖ వాణి కామెడీ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోహీరోయిన్లకి అమ్మగా, అత్తగా, పిన్నిగా కనిపిస్తూ ఆకట్టుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్‌తో మెప్పించారు. దీంతో చాలా పాపులర్‌ అయ్యారు. అయితే ఇటీవల కాలంలో సురేఖ వాణి చాలా ఓపెన్‌ అవుతుంది. తనకు సంబంధించిన విషయాలను షేక్‌ చేసుకుంటూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

26

సురేఖ వాణి తన భర్త చనిపోయిన తర్వాత కొన్నాళ్లు ఇబ్బంది పడింది. అనేక అవమానాలు, నిందలు పడ్డట్టు వెల్లడించింది. వాటిని దాటుకుని ఇప్పుడు స్వేచ్ఛగా విహరిస్తుంది. తన కూతురు సుప్రీతతో కలిసి ఆమె ఎంజాయ్‌ చేస్తుంది. తమకు నచ్చినట్టు లైఫ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. 
 

36

పార్టీల్లో ఎంజాయ్‌ చేస్తూ కనిపిస్తున్నారు. అదే సమయంలో పొట్టి దుస్తుల్లో మెరుస్తూ షాకిస్తున్నారు. ఈ క్రమంలో కొంత ట్రోల్‌కి కూడా గురవుతున్నారు. తాజాగా సురేఖ వాణి దిగిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇది టాలీవుడ్‌ ని షేక్‌ చేస్తుంది. ఇందులో ఆమె బాలీవుడ్‌కి చెందిన ఓ మిస్టీరియస్‌ పర్సన్‌తో ఫోటో దిగడమే కారణం. 

46

బాలీవుడ్‌ సెలబ్రిటీలతో ఫోటోలు దిగుతూ పాపులర్‌ అవుతున్నాడు ఓర్రీ. ఆయన ఏం చేస్తాడనేది ఎవరికి తెలియదు. కానీ సెలబ్రిటీలందరితోనూ ఫోటోలు దిగుతూ మెరుస్తుంటాడు. ముఖ్యంగా హీరోయిన్లతో ఎక్కువగా ఫోటోలు దిగుతాడు. అది కూడా పార్టీల్లోనే. ఇలా హీరోయిన్ల పార్టీలకు వెళుతూ ఫోటోలు దిగుతూ సెన్సేషన్‌గా మారుతున్నాడు. ఆయన అందరిలోనూ ఓ మిస్టరీ సెలబ్రిటీగా రాణిస్తున్నాడు. 
 

56

తాజాగా ఆ ఓరీతో సురేఖ వాణి ఫోటో దిగడం విశేషం. ఓ పార్టీలో ఆమె ఓరీతోఫోటో దిగింది. ఇందులో గ్లామరస్‌గా ఉంది సురేఖవాణి. చాలా హాట్‌గా ఉంది. ఇది పార్టీలోనే దిగిన ఫోటో అని తెలుస్తుంది. సహజంగా ఓరీతో ఫోటో అంటే లక్షల వ్యవహారం అట. మరి సురేఖ వాణి కూడా అంత పే చేసి దిగిందా, లేక పార్టీల్లో కాజ్వల్‌గా దిగిందా అనేది తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ పిక్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ఓరీతో సురేఖ వాణికి ఉన్న సంబంధమేంటి? ఎందుకు కలిసిందనేది పెద్ద మిస్టరీగా మారింది. 

66
Surekha Vani

ఇదిలా ఉంటే సురేఖ వాణి కూతురు సుప్రీత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె హీరోయిన్‌గా ఓ మూవీ తెరకెక్కుతుంది. బిగ్‌ బాస్‌ ఫేస్‌ అమర్‌ దీప్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ ఇద్దరు జంటగా కొత్త చిత్రం తెరకెక్కుతుంది. కూతురు సుప్రీతని హీరోయిన్‌గా నిలబెట్టాలని సురేఖ ప్లాన్‌ చేస్తుంది. ప్రస్తుతం దానిపైనే ఫోకస్‌ పెట్టింది. మరి కూతురు హీరోయిన్‌గా ఎంత మేరకు మెప్పిస్తుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories