మలయాళ చిత్రాలు ఇప్పుడు అన్ని ఇతర భాషా చిత్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అదే సమయంలో బాక్సాఫీసు వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి. ఇతర సినిమాలకు పెద్ద షాక్ ఇస్తున్నాయి. `మంజుమ్మల్ బాయ్స్`, `ప్రేమమ్` వంటి సినిమాలకు లభించిన ఆదరణ దీనికి నిదర్శనం. ఇప్పుడు బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది `కొత్త లోక`(లోక: చాప్టర్ 1 చంద్ర). ఈ మూవీ మలయాళ ప్రేక్షకులను మించి, ఇతర భాషా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. ఇది `కూలీ`కి షాక్ ఇవ్వడం విశేషం.
24
కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న `కొత్త లోక` మూవీ
సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. నజ్రియా, చందు, సలీం కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించగా, ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన మొదటి రోజు నుంచే మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం, వసూళ్లలోనూ సత్తా చాటుతోంది. కొత్తగా విడుదలైన చిత్రాలన్నింటినీ `కొత్త లోక` చిత్రం వెనక్కి నెట్టేసింది.
34
`కొత్త లోక` బాక్సాఫీసు వసూళ్లు
తమిళంలో `కొత్త లోక` చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇది విడుదలైన నాలుగు రోజుల్లో రూ.3.85 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.100 కోట్లకు చేరువవుతున్నాయి. ఇంకొన్ని రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెంచరీ కొట్టేస్తుందని అంచనా. అయితే `ప్రేమమ్`, `మంజుమ్మల్ బాయ్స్` చిత్రాల తర్వాత కోలీవుడ్‌లో ఇంతటి ఆదరణ పొందుతున్న చిత్రం `కొత్త లోక` కావడం విశేషం. ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణతో, దీనికి అధిక సంఖ్యలో థియేటర్లు కేటాయిస్తున్నారు.
తమిళనాట ప్రస్తుతం చాలా థియేటర్లలో రజనీకాంత్ `కూలీ` చిత్రమే ప్రదర్శితమవుతోంది. కానీ `కొత్త లోక` ఫస్ట్ డే కేవలం రూ.86 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మంగళవారం రూ.90 లక్షలకు పైగా వసూళ్లు రాబట్టింది. వీక్ డేస్లో ఇతర భాషా చిత్రానికి ఇంతటి ఆదరణ లభించడం అరుదైన విషయంగా చెప్పొచ్చు. ఇది నెమ్మదిగా రజనీకాంత్ `కూలీ`ని దెబ్బ కొడుతూ క్రమంగా పుంజుకోవడం విశేషం. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఈ చిత్రం కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం విశేషం. `కొత్త లోక` తెలుగులోనూ మంచి ఆదరణ పొందుతుంది. తెలుగులో ఇది ఐదు రోజుల్లో రూ.5కోట్లు రాబట్టడం విశేషం.