దర్శకుడు క్రిష్ జెగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్య రావు, జాన్ విజయ్, విటివి గణేష్ వంటి వారు ఇందులో నటించారు. ఈ సినిమాకి నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందించారు. తెలుగులో నిర్మించిన ఈ చిత్రం తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా నటుడు విక్రమ్ ప్రభు తొలిసారిగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. సెప్టెంబర్ 5న ఈ మూవీ విడుదల కాబోతుంది.