పెద్ది రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది. చిరంజీవి జోక్యం చేసుకోటంతో రెండు మీటింగులలో వివాదం సద్దుమణిగింది. ఎగ్జిబిటర్లు కొంత కాలంగా పర్సెంటేజీ విధానం కావాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.
థియేటర్ల పర్సెంటేజీ విధానానికి ఎగ్జిబిటర్లు డిమాండ్
పెద్ది మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న టైంలో టాలీవుడ్ లో థియేటర్ల పర్సెంటేజి విధానం పై వివాదం మొదలైంది. థియేటర్లకు రెంటల్స్ కాకుండా పర్సెంటేజీ ఇవ్వకపోతే సినిమాల ప్రదర్శన నిలిపివేస్తాం అంటూ ఎగ్జిబిటర్లు ప్రకటన చేశారు. పెద్ది చిత్రాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఈ కుట్రకు తెరలేపారు అంటూ చాలా వాదనలు వినిపించాయి.
25
నిర్మాతల మధ్య వివాదాలు
టాలీవుడ్ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ముఖ్యంగా శిరీష్, సునీల్ నారంగ్ లాంటి వారు పర్సెంటేజీ విధానానికి పట్టుపట్టారు. మైత్రి నిర్మాతలు వాళ్లకు కౌంటర్ ఇవ్వడంతో వివాదం ముదిరింది. దీనితో పెద్ది రిలీజ్ పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
35
రంగంలోకి చిరంజీవి
ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎగ్జిబిటర్లతో చిరంజీవి 2 సార్లు సమావేశం అయ్యారు. ఎగ్జిబిటర్లకు చిరంజీవి హామీ ఇచ్చారు. సమస్యలు పరిష్కరిస్తాం అని చెప్పడంతో వివాదం ముగిసినట్లు తెలిసింది. జూన్ 30న పర్సెంటేజీ విధానంపై నిర్ణయం తీసుకుందాం అని మెగాస్టార్ ఎగ్జిబిటర్లకు హామీ ఇచ్చారు.
అప్పటి వరకు రిలీజయ్యే సినిమాలన్నీ పెద్దితో సహా రెంటల్ విధానంలోనే రిలీజ్ కానున్నాయి. చిరంజీవి ఇచ్చిన భరోసాతో ఎగ్జిబిటర్లు శాంతించారు. దీనితో పర్సెంటేజీ విధానం సమస్య తాత్కాలికంగా సద్దుమణిగినట్లు అయింది. పెద్ది రిలీజ్ కి లైన్ క్లియర్ అయింది.
55
మీటింగ్ లో పాల్గొన్న ప్రముఖులు
మే 25న ఎగ్జిబిటర్లు చిరంజీవితో సమావేశం అయ్యారు. కాగా నేడు మే 27న మరోసారి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చిరంజీవితో పాటు అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి వారు కూడా పాల్గొన్నారు.