యాంగిల్ అలా సెట్ అయ్యింది, నిజంగా ఇంత అందంగా ఉండను... ఛార్మి అలా అనేసిందేంటి!

Published : Jun 27, 2023, 10:09 AM IST

ఛార్మి హీరోయిన్ గా రిటైరై చాలా కాలం అవుతుంది. దీంతో ఆమె గ్లామర్ మీద ఫోకస్ తగ్గించారు. నిర్మాతగా మారాక ఛార్మి ఫిట్నెస్ వదిలేశారు.

PREV
16
యాంగిల్ అలా సెట్ అయ్యింది, నిజంగా ఇంత అందంగా ఉండను... ఛార్మి అలా అనేసిందేంటి!
Charmi kaur

ఈ మధ్య ఛార్మి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండటం లేదు. లైగర్ ఫెయిల్యూర్ అనంతరం కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల రామ్ పోతినేనితో ఒక ప్రాజెక్ట్ ప్రకటించారు. డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఛార్మి-పూరి తలమునకలయ్యారు.

26

ఇంస్టాగ్రామ్ లో తన లేటెస్ట్ లుక్ షేర్ చేసిన ఛార్మి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. లైటింగ్, యాంగిల్ అలా సెట్ అయ్యాయి. నిజానికి నేను ఇంత అందంగా ఉండను, అని ఛార్మి అభిప్రాయపడ్డారు. ఈ ఫొటోలో కనిపించేంత అందంగా నేను లేనని ఆమె చెప్పకనే చెప్పారు. 

36

15 ఏళ్లకే హీరోయిన్ గా మారింది ఛార్మి కౌర్. 2002లో విడుదలైన నీతోడు కావాలి మూవీతో హీరోయిన్ అయ్యారు. గౌరి, మాస్, పౌర్ణమి, రాఖీ, లక్ష్మి చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. దర్శకుడు పూరి దర్శకత్వంలో జ్యోతిలక్ష్మి టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. 2015లో సిల్వర్ స్క్రీన్ కి దూరమైంది. 

46


దర్శకుడు పూరితో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసింది. నిర్మాత అయ్యాక నటనకు గుడ్ బై చెప్పేసింది. ఇస్మార్ట్ శంకర్ మినహాయిస్తే పూరి కనెక్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఒక్క సినిమా కూడా ఆడలేదు. ఈ బ్యానర్ లో జ్యోతిలక్ష్మి మొదటి చిత్రం. 
 

56

అయితే లైగర్ తలనొప్పులు పూరి-ఛార్మిలను వెంటాడాయి. ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నైజాం ఎగ్జిబిటర్స్, లీజర్స్ రిలే నిరాహార దీక్షలు చేశారు. లైగర్ నష్టాల్లో కొంత మొత్తం తిరిగి చెల్లించాలని నిరసన చేశారు. మరి ఎంత తిరిగి ఇచ్చారో తెలియదు కానీ ఎగ్జిబిటర్లు నిరసనలు విరమించారు. 
 

66
ఛార్మి - 31


ఇక పూరి-ఛార్మి సహజీవనం చేస్తున్నారనే వాదన ఉంది. చాలా కాలంగా వీరిద్దరూ కలిసే జీవిస్తున్నారు. డ్రగ్స్ ఆరోపణల్లో ఇద్దరి పేర్లు ఉన్నాయి. రెండు సార్లు విచారణ ఎదుర్కొన్నారు. లైగర్ లావాదేవీల విషయంలో  ఈడీ విచారణ కూడా ఎదుర్కొన్నారు. 

click me!

Recommended Stories