మమ్మల్నే బెదిరిస్తావా అంటూ సేటు నెత్తి మీద నాలుగు దెబ్బలు వేస్తుంది కనకం. మళ్లీ స్పృహ తప్పిపోతాడు సేటు. నిన్ను నమ్మిన ప్రతిసారి ఇలాగే మోసం చేస్తున్నావు డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకురమ్మని చెప్పి ఈరోజు నన్ను ఇలా బుక్ చేసేసావు అంటూ చెల్లెల్ని తిడుతుంది మీనాక్షి. మరోవైపు డాక్టర్ ఇంటికి రావడంతో మరింత కంగారు పడతారు స్వప్న, కావ్య. డాక్టర్ కి విషయం చెప్పి స్వప్నని టెస్ట్ చేయమని చెప్తుంది అపర్ణ.