గతంలో కంటే విడాకుల తర్వాతే సామ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది. అలాగే ప్రస్తుతం వరుస చిత్రాలు చేస్తోంది. సమంత నటించిన 'కన్మణి రాంబో ఖతీజా' చిత్రం ఇటీవల విడుదలయింది. ఇక యశోద, శాకుంతలం, ఖుషి లాంటి చిత్రాల్లో సమంత నటిస్తోంది. ఇంత బిజీగా ఉండే సమంత సోషల్ మీడియాకి ఎప్పుడూ దూరం కాలేదు. కానీ సామ్ కొంత కాలంగా సోషల్ మీడియాలో సైలెన్స్ మైంటైన్ చేస్తోంది.