మాచర్ల నియోజకవర్గంలో అందాల ఉప్పెన.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి మెరుపులు

Published : Aug 07, 2022, 10:35 PM ISTUpdated : Aug 07, 2022, 10:38 PM IST

నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంపై క్రమంగా బజ్ పెరుగుతోంది. ఆగష్టు 12న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి నేడు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.

PREV
17
మాచర్ల నియోజకవర్గంలో అందాల ఉప్పెన.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి మెరుపులు

నితిన్ నటిస్తున్న 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంపై క్రమంగా బజ్ పెరుగుతోంది. ఎడిటర్ శేఖర్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి చేసిన ప్రచార కార్యక్రమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.   

27

ఇటీవల విడుదలైన ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు శేఖర్ కి ఇది డెబ్యూ చిత్రమే అయినప్పటికీ అద్భుతమైన అవుట్ పుట్ రాబట్టినట్లు అర్థం అవుతోంది. ఈ చిత్రంలో నితిన్ జిల్లా కలెక్టర్ పాత్రలో నటిస్తున్నాడు. 

 

37

ఈ కమర్షియల్ మూవీలో పొలిటికల్ థీమ్ ప్రధాన ఆకర్షణగా ఉండబోతోంది. సముద్ర ఖని ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

47

ఆగష్టు 12న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి నేడు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాచర్ల మూవీ టీంతో పాటు కొందరు అతిథులు కూడా సందడి చేశారు. 

57

గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడి.. భోళాశంకర్ దర్శకుడు మెహర్ రమేష్, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. 

67

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి బ్లాక్ శారీలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. కృతి శెట్టి గ్లామర్ ప్రీ రిలీజ్ వేడుకలో హైలైట్ గా నిలిచింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో కృతి శెట్టి ఎంతో అందంగా కుర్రాళ్లు కోరుకునే విధంగా కనిపిస్తోంది. 

77

నితిన్, చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి మాచర్ల మూవీ విజయంపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తంగా మాచర్ల నియోజకవర్గం చిత్రంపై పాజిటివ్ బజ్ నెలకొంది. రిలీజ్ తర్వాత ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది. 

click me!

Recommended Stories