మోడ్రన్ నాగేశ్వరరావును చూశారా? నాగ్, నాగ చైతన్య సరిపోరు!

Published : Jan 13, 2024, 04:01 PM IST

సాంకేతికత ఒకప్పటి స్టార్స్ మోడరన్ లుక్ తెరపైకి తెస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతం చేస్తుంది. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు AI  వెర్షన్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది.   

PREV
15
మోడ్రన్ నాగేశ్వరరావును చూశారా? నాగ్, నాగ చైతన్య సరిపోరు!
ANR

ఇటీవల నెట్టింట నటుడు శోభన్ బాబు యంగ్ లుక్ వైరల్ అయ్యింది. ఆ ఫోటోలు చూసి కొందరు శోభన్ బాబు వారసుడేమో అని భ్రమ పడ్డారు. అంత సహజంగా ఇప్పటి శోభన్ బాబులా ఆ వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. తాజాగా నాగేశ్వరరావు యంగ్ లుక్ తెరపైకి వచ్చింది. 


 

25
ANR

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో  ఏఎన్నార్ ని రీ క్రియేట్ చేశారు. ఏఎన్నార్ ఈ జెనరేషన్ హీరో అయితే ఆయన లుక్ ఇలా ఉండేదేమో అన్నట్లు ఆ ఫోటోలు ఉన్నాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏఎన్నార్ ఏఐ వెర్షన్ వీడియో విడుదల చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది. 

35
ANR

ఏఎన్నార్ AI  లుక్ చూస్తే వారి వారసులు నాగార్జున, నాగ చైతన్య అసలు సరిపోరు అన్నట్లుగా ఉన్నాయి. మన్మధుడికి మరో రూపంలా ఏఎన్నార్ ఉన్నారు. చూడగానే కట్టిపడేసే రూపం. 
 

45


టాలీవుడ్ కి ఎన్టీఆర్-ఏఎన్నార్ రెండు కళ్ళు అంటారు. నాగేశ్వరరావు రొమాంటిక్ హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు. దశాబ్దాల పాటు ఆయన నట ప్రస్థానం సాగింది. తొంబై ఏళ్లకు పైగా ఆయన జీవించారు. 


 

55

నాగేశ్వరరావు చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉన్నారు. నాగేశ్వరరావు చివరి చిత్రం మనం. అప్పటికే ఆయన పరిస్థితి విషమించింది. మనం విడుదలకు ముందు నాగేశ్వరరావు కన్నుమూశారు. మనం మూవీ 2014లో విడుదలైంది. 

Read more Photos on
click me!

Recommended Stories