ఈ క్రమంలో గుంటూరు కారం నిర్మాత నాగవంశీ, ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. దిల్ రాజు మాట్లాడుతూ.. రాత్రి 1 గంటకు ప్రదర్శించిన బెనిఫిట్ షోలు, ప్రీమియర్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే అని అన్నారు. నేను కూడా సోషల్ మీడియాలో యావరేజ్ అని, మిక్స్డ్ టాక్ చూశాను.