మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మొదటి రోజు కలెక్షన్లలో Guntur Kaaram Record క్రియేట్ చేసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ Trivikram కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘గుంటూరు కారం’ Guntur Kaaram. సంక్రాంతి కానుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
26
Guntur Kaaram
జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ‘గుంటూరు కారం’ విడుదలైంది. సినిమాకు అన్నీ చోట్ల మంచి రెస్పాన్సే వచ్చింది. కొంత నెగెటివ్ టాక్ కూడా వినిపించింది. ఏదేమైనా మహేశ్ బాబు రేంజ్ తో సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.
36
ఈ క్రమంలో ‘గుంటూరు కారం’ మొదటి రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులు కూడా కలెక్షన్ల కోసం ఎదురుచూస్తుండగా.. తాజాగా మేకర్స్ మొదటి రోజు డే1 కలెక్షన్ల వివరాలను ప్రకటించారు.
46
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు రూ.94 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసింది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రీజినల్ ఫిల్మ్ లో ఈ మూవీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
56
Mahesh Babu receives 50 crore for Guntur Kaaram as remuneration
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మొదటి రీజినల్ ఫిల్మ్ గా ‘గుంటూరు కారం’ రికార్డు క్రియేట్ చేసింది. సినిమాపై రివ్యూలు ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపిస్తోంది.
66
Guntur Kaaram Review
ప్రస్తుతం సంక్రాంతికి ఇదే పెద్ద సినిమా కావడం, అందులో మహేశ్ బాబు సినిమా అవ్వడంతో లాంగ్ రన్ లో మరింత కలెక్షన్స్ ను సాధించే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించారు.