Janaki Kalaganaledu: సునందకి బుద్ధి చెప్పిన జానకి.. జ్ఞానాంబను దారుణంగా అవమానించిన లీలావతి?

First Published Jan 19, 2023, 11:52 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 19వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్లో ఒక ఆవిడ జ్ఞానాంబ దగ్గరికి మీ మంచి మనసుతో నా మనవడిని దీవించండి అమ్మ అని పిలుస్తుంది. అప్పుడు ఆవిడ రండమ్మా అని పిలవడంతో సరే అని అక్కడికి వెళుతుంది జ్ఞానాంబ. అప్పుడు మల్లిక ఈ లీలావతి పెద్దమ్మ ఎక్కడ ఉంది అని గుడి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇంతలోనే లీలావతి నేను లేను అనుకున్నారా చచ్చిపోయాను అనుకున్నారా అంటూ అక్కడికి ఓవర్ చేస్తూ వస్తుంది. అప్పుడు లీలావతి కావాలనే జ్ఞానాంబ అవమానించేలా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు లక్ష్మీదేవిలా మెరిసిపోయే దానివి ఒంటి మీద నగలేవి ఏంటి ఇలా అయిపోయావు అని అంటుంది.

 ఆస్తులు పోయి రోడ్డున పడ్డారని తెలిసింది కానీ ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటారనుకోలేదు జ్ఞానాంబ అని కావాలనే దెప్పిపొడిచే విధంగా మాట్లాడుతుంది లీలావతి. అప్పుడు పక్కనే ఉన్న కొంతమంది ఆడవాళ్లు ఏమైంది లీలావతి ఇలా మాట్లాడుతున్నావు అనడంతో మీకు అసలు విషయం తెలియదు కదా రామచంద్ర అప్పు చేసి రోడ్డున పడ్డాడు కుటుంబం మొత్తం వీధిపాలయ్యింది అని అంటుంది లీలావతి. అవునా మేము ఇంటికి తాళం వేసి ఉంటే ఎక్కడికైనా వెళ్లారేమో అనుకున్నాము అనడంతో అది వీళ్ళు వేసిన తాళం కాదు అప్పుల వాళ్ళు తరిమేసి వేశారు అని అంటుంది లీలావతి. అప్పుడు లీలావతి ఎన్ని మాటలు అన్న జ్ఞానాంబ మౌనంగా ఉండడంతో మల్లిక లోపాల సంతోషపడుతూ ఉంటుంది.

ఇంతలోనే అదే గుడికి సునంద వస్తుంది. అప్పుడు సునంద లోపలికి వెళ్తూ జానకిని చూసి ఎప్పుడు దొరుకుతావా అని చూశాను దొరికావే అని అక్కడికి వెళుతుంది. అప్పుడు అక్కడికి వెళ్లి ఏవండీ ఐపీఎస్ జానకి గారు అని అంటుంది. ఏంటి మీ అత్తగారు తమ కోడలు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే నువ్వు ఇలా ప్లేట్లు తుడుచుకుంటూ క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నావు అని అంటుంది సునంద. ఐపీఎస్ చదువు పక్కన పెట్టేసి ఇలా బతికేద్దామని ఫిక్స్ అయ్యావా అని జానకిని అవమానిస్తూ మాట్లాడుతుంది సునంద. ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాకు దగ్గరకు వచ్చి ఉంటే నా ఫ్యాక్టరీలో పని ఇచ్చేదాన్ని కదా అనడంతో ఇప్పుడు జానకి సునందుకు గట్టిగా కౌంటర్ ఇస్తూ నీలాంటి వాళ్ళ దగ్గర పని చేసుకునే దానికంటే ఇలా పని చేసుకోవడమే మంచిది అని అంటుంది.

నీ తల పొగురు ఇంకా తగ్గలేదా అనగా తల పొగరికి ఆత్మబిమానానికి తేడా తెలియని చోటే నువ్వు ఆగిపోయావు అని అంటుంది జానకి. గుడికి వచ్చినట్టు ఉన్నావు వెళ్లి దేవుడిని మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా అని కోరుకో ఇక్కడి నుంచి వెళ్ళు అనడంతో సునంద ఏం మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మల్లికతో జ్ఞానాంబ  ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద అనగా చూశారా అందరి ముందు తలెత్తుకోలేకపోతోంది అవమానిస్తూ మాట్లాడుతుంది లీలావతి. అప్పుడు లీలావతి చేసింది అంతా చేసి చివర్లో నన్ను క్షమించు జ్ఞానాంబ అని అడుగగా జ్ఞానాంబ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా ఇంతలోనే సునంద ఎదురుపడుతుంది.
 

 ఏంటి జ్ఞానాంబ నీ కోడలు ఐపీఎస్ అవుతుందని చెప్పావు అక్కడ చూస్తే నీ కొడుకు కోడలు క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నారు అనడంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. అప్పుడు మధ్యలో లీలావతి ఎంటర్ అయ్యి జ్ఞానాంబని మరింత అవమానించే విధంగా మాట్లాడుతుంది. ఇంతలోనే రామచంద్ర అక్కడికి వచ్చి పెద్దయ్య భోజనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబని చూసి రామచంద్ర షాక్ అవుతాడు. ఇంతలోనే జానకి అక్కడికి వస్తుంది. అప్పుడు ఒక ఆమె ఈ స్వీట్స్ బాగోలేవు అనడంతో ఈ జ్ఞాన ప్రసూనాంబ అనేది ఈ స్వీట్ కొట్టు వీళ్ళదే అనడంతో ఆమె వాళ్ళ పై సీరియస్ అవుతుంది.
 

అప్పుడు నోటికి వచ్చిన విధంగా మాట్లాడి జ్ఞానాంబను అవమానిస్తుంది. అప్పుడు తలా ఒక మాట అనడంతో జ్ఞానాంబ  కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు లీలావతి సునందకి తోడై వాళ్ళని మరింత అవమానిస్తూ ఉంటుంది. అప్పుడు రామచంద్ర ఆ స్వీట్ బాక్స్ తీసుకొని కోపంగా అక్కడి నుంచి బయలుదేరుతాడు. తర్వాత రామచంద్ర ఆ స్వీట్ కొట్టు షాపు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు షాప్ లో ఉన్న స్వీట్స్ అన్ని తిని అందరి ముందు ఏంటి బాబాయ్ ఇలా నాసిరకంగా స్వీట్లు తయారు చేస్తున్నారు ఎన్నో ఏండ్లు కష్టపడి ఆ పేరు సంపాదించుకుంటే ఇప్పుడు నాశరకంగా తయారు చేసి ఆ పేరు అంత పోగోడుతున్నారు అని అంటాడు. అప్పుడు భాస్కర్ రావు మాకు చేతనైతే మేము చేసుకుంటాము ఇప్పుడు ఇది మా షాపు అని అంటాడు. 
 

అప్పుడు షాప్ లో స్వీట్ క్వాలిటీ గురించి షాపు పేరు గురించి రామచంద్ర షాపు ఓనర్లతో గొడవ పడుతూ ఉంటాడు. ఇంతలోనే జానకి అక్కడికి వస్తుంది. అప్పుడు రామచంద్ర ముందు ఈ స్వీట్ షాప్ కి ఉన్న మా అమ్మ పేరు తీసేయండి అని అంటాడు. నేను మీ అమ్మ పేరు బోర్డు తీసేయను కావాలంటే డబ్బులు కట్టి నీ షాప్ విడిపించుకో అంటాడు భాస్కరరావు. అప్పుడు జానకి చాలండి ఇప్పటికి జరిగింది చాలు అందరూ మనల్ని చూస్తున్నారు అని అంటుంది. అప్పుడు జానకి రామచంద్రకి నచ్చ చెప్పి అక్కడ నుంచి పిలుచుకొని వెళుతుంది. మరొకవైపు జ్ఞానాంబ జరిగిన విషయం తలచు కొని బాధపడుతూ ఉండగా జానకి దొంగ ఏడుపులు ఏడుస్తూ దొంగనాటకాలు ఆడొద్దు. జ్ఞానాంబ బాధని మరింత బాధపడుతూ ఉంటుంది. మీరు చూడలేదు కానీ చాలా అవమానం జరిగింది మామయ్య అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది మల్లిక. ఇంతలోనే జానకి రామచంద్ర అక్కడికి వస్తారు. ఇంతలోనే జెస్సి అ క్కడికి వచ్చి అత్తయ్య గారు వెన్నెలా వస్తోంది అఖిల్ తీసుకురావడానికి వెళ్లాడు అని చెబుతుంది.

click me!