‘ఎస్ఎస్ఎంబీ28’ సెట్స్ లో మహేశ్ బాబు.. వైరల్ అవుతున్న ఫొటోలు.. తాజా షెడ్యూల్ డిటేయిల్స్ ఇలా?

First Published | Jan 19, 2023, 11:00 AM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలోని  యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఎస్ఎస్ఎంబీ28’ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. దీంతో సెట్స్ నుంచి మహేశ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక సెకండ్ షెడ్యూల్ డిటేయిల్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. 
 

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్లీ ఇన్నాళ్లకు సెట్ అయ్యింది.  అతడు, ఖలేజా.. తర్వాత పదేండ్ల సమయానికి కుదిరిన ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 
 

ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ను హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మాత చిన్నబాబు మరియు సూర్యదేవర నాగవంశీ రూపొందిస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో నాగవంశీ చెప్పినట్టుగా  నిన్న SSMB28 షూటింగ్ పునఃప్రారంభమైంది. దీంతో అభిమానులు షుల్ ఖుషీ అవుతున్నారు. 
 


హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మహేశ్ బాబు, పూజా హెగ్దే పాల్గొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ సెట్స్ కు హాజరైనటువంటి ఫొటోలు నెట్టింట వైలర్ అవుతున్నాయి. పూజా హెగ్దే సెట్స్ లో కూల్ గా కనిపించింది.

ఇక మహేశ్ బాబు ఫైట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ లతో సీన్ కు సంబంధించిన విషయాలను మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే తాజా షెడ్యూల్ లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారంట. 14 రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. 
 

మరోవైపు మహేశ్ బాబు గడ్డంతో కనిపించబోతున్నారని, సూపర్ స్టార్ రగ్డ్ లుక్ లో మునుపెన్నడూ చూడని క్యారెక్టరైజేషన్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ను కలుపుకొని ఎపిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్రం రూపుదిద్దుకుంటుందని మేకర్స్ తెలపడంతో సినిమాపై ఆసక్తిని పెంచేసింది.
 

‘ఎస్ఎస్ఎంబీ28’లో మహేశ్ బాబు సరసన పూజా హెగ్దే (Pooja Hegde), యంగ్ బ్యూటీ శ్రీలీలా (Sree Leela) నటించబోతున్నారు. లాంగ్ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
 

Latest Videos

click me!