చిత్తూరు పిల్లగా రచ్చ చేస్తోన్న మెగా కోడలు.. లావణ్య త్రిపాఠి `సతీ లీలావతి` నుంచి అదిరిపోయే పాట

Published : Aug 13, 2025, 10:03 AM IST

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ `సతీ లీలావతి`. ఈ చిత్రం నుంచి మొదటి పాట విడుదలైంది. చిత్తూరు పిల్లగా రచ్చ చేస్తోంది లావణ్య. 

PREV
15
`సతీ లీలావతి`గా రాబోతున్న లావణ్య త్రిపాఠి

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. త్వరలో ఆమె పండండి బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. మరోవైపు ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న `సతీ లీలావతి` మూవీ రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి మంచి అప్‌ డేట్‌ వచ్చింది. ఫస్ట్ సాంగ్‌ విడుదలైంది. `చిత్తూరు పిల్ల` అంటూ సాగే పాటని విడుదల చేశారు.

DID YOU KNOW ?
`మిస్టర్‌` టైమ్‌లో ప్రేమ
లావణ్య త్రిపాఠి, వరుణ్‌ తేజ్‌ `మిస్టర్‌` సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నాళ్లు ప్రేమించుకుని 2023 నవంబర్‌ 1న పెళ్లి చేసుకున్నారు.
25
`చిత్తూరు పిల్ల`గా రచ్చ చేస్తున్న మెగా కోడలు

 హీరోహీరోయిన్ల మధ్య పెళ్లి సందడి సందర్బంగా వచ్చే ఈ `చిత్తూరు పిల్ల`  పాట ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఆద్యంతం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతేకాదు ఇకపై పెళ్లి ఫంక్షన్లలో మారుమోగేలా ఈ పాట ఉండటం విశేషం. ప్రస్తుతం శ్రోతలను అలరిస్తున్న ఈ పాట విజువల్స్ పరంగానూ కనువిందు చేసేలా ఉంది.

35
గుండెల్ని తాకేలా `చిత్తూరు పిల్ల` బాణీలు

`సతీ లీలావతి` నుంచి విడుదలైన ఈ ఫస్ట్ సింగిల్‌ని వనమాలి రచించగా, నూతన మోహన్, కృష్ణ తేజస్వీ, రితేజ్ జి రావు సంయుక్తంగా ఆలపించారు. మిక్కీ జే మేయర్ అందించిన బాణీ సుతిమెత్తగా అందరినీ గుండెల్ని తాకేలా ఉంది. ఇక బృందా మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ లిరికల్ వీడియో ఎంతో చూడముచ్చటగా మారింది. 

45
భార్య భర్తల అనుబంధం నేపథ్యంలో `సతీ లీలావతి`

లావణ్య త్రిపాఠి, దేవ్‌ మోహన్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో దుర్గాదేవి బ్యానర్‌పై నాగమోహన్‌ నిర్మించారు. `భీమిలీ కబడ్డీ జట్టు`, `ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి)` ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ తెర‌కెక్కించినట్టుగా ఆ మధ్య విడుదలైన టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.

55
`సతీ లీలావతి` షూటింగ్‌ పూర్తి

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సతీ లీలావతి’ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం సినిమాను  పూర్తి చేసి  త్వరలో విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నాం. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీమ్‌ తెలిపింది. ఈ మూవీకి కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు. ఇందులో వీకే నరేష్‌, వీటీవీ గణేస్‌, సప్తగిరి, మొట్ట రాజేంద్రన్‌, జాఫర్‌ సాదిక్‌, జోషి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories