మెగా కోడలు లావణ్య త్రిపాఠి కథ కూడా వినకుండా వినకుండా రిజెక్ట్ చేసిన సినిమా ఏదో తెలుసా? విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆసినిమా చేసి ఉంటే..లావణ్య కెరీర్ మరో స్థాయిలో ఉండేదా?
టాలీవుడ్ నటి, మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన తాజా సినిమా సతీ లీలావతి ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత ఆమె నటిస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా ఆమె పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన కెరీర్‌లో మిస్ అయిన ఒక పెద్ద హిట్ సినిమా గురించి ఆమె వెల్లడించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
24
రిజెక్ట్ చేసిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ అయితే..
సినీ పరిశ్రమలో చాలాసార్లు మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి జారిపోతాయి. కొన్ని సందర్భాల్లో రిజెక్ట్ చేసిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి. చాలామంది స్టార్స్ విషయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక లావణ్య త్రిపాఠి విషయంలో కూడా ఇలానే జరిగింది. తన కెరీర్ లో ఇలాంటి అనుభవం తన కెరీర్‌లో కూడా జరిగినట్లు లావణ్య త్రిపాఠి చెప్పారు.
34
కథ వినకుండానే నో చెప్పిన లావణ్య..
ఒక ఇంటర్వ్యూలో లావణ్యకు ఒక ప్రశ్న ఎదరయ్యింది. “మీరు రిజెక్ట్ చేసిన తరువాత హిట్ అయిన సినిమా ఏదైనా ఉందా?” అని ప్రశ్నించగా, ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఒక సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మొదట కథ వినకుండానే తాను ‘నో’ చెప్పినట్లు లావణ్య వెల్లడించారు.
అయితే తర్వాత ఆ కథ గురించి తెలిసినప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలని అనిపించిందని తెలిపారు.కానీ అప్పటికే ఆ అవకాశం తన చేతుల నుంచి జారిపోయిందని ఆమె చెప్పారు. ఆ తర్వాత అదే సినిమాలో మరో హీరోయిన్ నటించి మంచి విజయాన్ని సాధించింది.
ఆ సినిమా మరేదో కాదు, విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘గీత గోవిందం’. మొదట ఈ సినిమాకి లావణ్యను సంప్రదించారట. కానీ కొన్ని కారణాల వల్ల లావణ్య చేయలేకపోవడంతో చివరికి ఆ పాత్రకు రష్మిక మందన్న సెలక్ట్ అయ్యింది. ఈ సినిమాలో లావణ్య నటించి ఉంటే.. రష్మిక విజయ్ జీవితంలోకి వచ్చేదో లేదో... ఆ సినిమా విజయంతో విజయ్ - రష్మిక జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. వారి స్నేహం ప్రేమ వరకూ వెళ్లింది.. పెళ్లి బంధం వరకూ వెళ్లింది.