Lavanya Tripathi: డైరెక్టర్ వేధించాడు.. సినిమా వదిలేస్తే కేసు పెట్టారు.. మెగా కోడలు బయటపెట్టిన నిజం

Published : Mar 16, 2026, 06:36 PM IST

ఒక తమిళ సినిమా షూటింగ్‌లో డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని నటి లావణ్య త్రిపాఠి చెప్పారు. దీనికోసం తనపై కేసు కూడా పెట్టారని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. 

PREV
15
మెగా కోడలిగా రాణిస్తోంది లావణ్య త్రిపాఠి

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇప్పుడు ఫ్యామిలీకే పరిమితమయ్యింది. కుమారుడు జన్మించడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆమె నటించిన `సతీ లీలావతి` మూవీ ఇప్పుడు రిలీజ్‌ కాబోతుంది. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి ఇటీవల వార్తల్లో నిలిచింది.  సోషల్‌ మీడియాలో వేధింపుల నేపథ్యంలో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.  అంతేకాదు తాజాగా మరో షాకింగ్‌ విషయాన్ని వెల్లడించింది. తనని ఓ తమిళ దర్శకుడు వేధించినట్టు వెల్లడించింది. 

25
ఇంట్లో కూర్చుని ఏడ్చిన లావణ్య త్రిపాఠి

 ఓ తమిళ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అందుకే ఆ సినిమా వదిలేశానని చెప్పింది. కానీ, ఆ చిత్ర బృందం తనపైనే కేసు పెట్టిందని లావణ్య తెలిపింది. అంతేకాదు, మీడియాలో తన గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారని లావణ్య ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒక రోజంతా ఇంట్లో కూర్చుని ఏడ్చేశానని చెప్పింది.

35
నాపై తప్పుడు వార్తలు రాయించారు

`నాకు సినిమా నేపథ్యం లేదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీలో సాయం చేసేవారు ఎవరూ ఉండరు. నేనొక తమిళ సినిమా చేయాల్సి ఉంది. ఆ డైరెక్టర్ ప్రవర్తన బాగాలేదు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే ఆ సినిమాకు నో చెప్పాను. తర్వాత వాళ్లు నాపై కేసు పెట్టారు. పేపర్లలో నా గురించి లేనిపోనివి రాయించారు. ఈ విషయం మొదటిసారి చెబుతున్నా` అని లావణ్య వివరించారు.

45
ఎవరి సాయం అడగలేదు

ఆమె ఇంకా మాట్లాడుతూ, `అప్పుడు ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు, సాయం కూడా అడగలేదు. కానీ ఆ ఒత్తిడికి ఒకరోజు ఇంటికి వచ్చి బాగా ఏడ్చాను. సాధారణంగా నేను ఏడవను. బాగా ఏడ్చాక లేచి ఒక టీ పెట్టుకున్నాను. ఏడవడం మంచిదే, అందులో తప్పేం లేదు`. 

55
ఇలాంటివి మనల్ని బలపరుస్తాయి

`కానీ నాకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. కొన్నిసార్లు ఇవి మనల్ని మరింత బలంగా మారుస్తాయి. వాళ్లతో పనిచేయడం కష్టం కాబట్టే నేను 'నో' చెప్పాను. అయినా వాళ్లు నన్ను ఇబ్బంది పెట్టడం ఆపలేదు` అని లావణ్య వెల్లడించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories