మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి Lavanya Tripathi రీసెంట్ గానే వివాహ బంధంలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నూతన జంటగా మెగా ఫ్యామిలీలో సందడి చేస్తున్నారు.
మరోవైపు వరుణ్, లావణ్య తమ పెళ్లి తర్వాత కెరీర్ పైనా శ్రద్ధ వహిస్తున్నారు. వరస ప్రాజెక్ట్స్ ను లైన్ పెడుతున్నారు. గతంలో ఒకే చెప్పిన ప్రాజెక్ట్స్ ను కూడా పూర్తి చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి ప్రస్తుతం ‘మిస్ పర్ఫెక్ట్’ Miss Perfect సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిసెంబర్ 2న సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో లావణ్యకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘మీరు చేసే సినిమాల పట్ల అత్తామామల నుంచి రిస్ట్రిక్షన్ ఉందా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. తన సినిమాల విషయంలో 16 ఏళ్ల నుంచి తానే నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పారు.
పెళ్లి తర్వాత మెగా కోడలిగా మరింత బాధత్యగా ఉంటానన్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి రిస్ట్రక్షన్స్ లేవు. మున్ముందు నేను తప్పుచేయనంత వరకు అలాంటివి ఉండవు. ఒకవేళ వస్తే అప్పుడు వారికి అవకాశం ఉంటుంది ’ అని చెప్పుకొచ్చింది.
అలాగే లావణ్య త్రిపాఠినా? మెగా కోడలా? మీ నిజజీవితంలో ఎవరిని ఇష్టపడుతున్నారని అడిగితే.. ఇద్దరూ ఇష్టమేనని.. మున్ముందు మెగా కోడలిగా తనపై మరింత బాధ్యత ఉంటుందని భావిస్తున్నాని చెప్పుకొచ్చారు.