డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నావా?
లావణ్య డబ్బుల కోసం రాజ్ తరుణ్ ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. అందుకే వివాదం రాజేస్తోంది. అతని రెప్యుటేషన్ దెబ్బ తీస్తుందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆమె వివరణ ఇచ్చారు. రాజ్ తరుణ్ నాకు ఇల్లు రాసిస్తాను అన్నాడు. అలాగే ప్రతి నెలా మెయింటెనెన్స్ ఇస్తాను, నన్ను వదిలేయ్ అన్నాడు. ప్రస్తుతం నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నా కుక్క పిల్లకు కూడా ఫుడ్ పెట్టలేని స్థితిలో నేను పోరాటం చేస్తున్నాను.
డబ్బులు కేవలం రాజ్ తరుణ్ దగ్గరే ఉన్నాయా? చాలా మంది దగ్గర ఉన్నాయి. నాకు పరిహారం అవసరం లేదు. రాజ్ తరుణ్ మాత్రమే కావాలి. రాజ్ తరుణ్ ని దక్కించుకునేందుకు నేను ఎంత వరకైనా వెళతాను, అన్నారు.