Bigg Boss 8: ఈసారి హౌస్లో రెండు జంటలు, వారికి సపరేట్ రూమ్స్... హిస్టరీలో మొదటిసారి! ఎవరు వారు? 

First Published | Jul 11, 2024, 8:58 AM IST

బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుండగా సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈసారి ఏకంగా రెండు జంటలను హౌస్లోకి పంపుతున్నారట. బిగ్ బాస్ చరిత్రలోనే ఇది అనూహ్య పరిణామం... మసాలా కంటెంట్ కోసం మేకర్స్ స్కెచ్ గా తెలుస్తుంది.. 
 

బిగ్ బాస్ తెలుగు 8 అనుకున్న సమయానికి ముందే ప్రారంభం కానుందని అందుతున్న విశ్వసనీయ సమాచారం. బిగ్ బాస్ సీజన్ 7 గత ఏడాది సెప్టెంబర్ లో మొదలై డిసెంబర్ లో ముగిసింది. సీజన్ 8 మాత్రం ఆగస్టులోనే లాంచ్ కానుందట. ఫస్ట్ లేదా లాస్ట్ వీక్ లో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. 
 

సీజన్ 8 బిగ్ బాస్ హౌస్ డిజైన్ పూర్తి చేశారట. త్వరలో అన్నపూర్ణ స్టూడియోలో నిర్మాణం చేపట్టనున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి అయినట్లు వినికిడి. యూట్యూబర్ బంచిక్ బబ్లు, బర్రెలక్క, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్, నటి హేమ, సురేఖావాణి, సోనియా సింగ్, అమృత ప్రణయ్, రీతూ చౌదరి, కుమారీ ఆంటీ.. లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు. 
 


Venu Swamy

అనూహ్యంగా వేణు స్వామి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల వరుస వివాదాలతో వేణు స్వామి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉన్నారు. ఆయనకు భారీ రెమ్యునరేషన్ చెల్లించి ఒప్పించారట. గతంలో ఏ కంటెస్టెంట్ కి ఇవ్వనంత రెమ్యూనరేషన్ వేణు స్వామికి చెల్లించారనే వాదన ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Bigg boss telugu 8


బిగ్ బాస్ సీజన్ 7 కి మించి సీజన్ 8 ఉండేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో సరికొత్త కాన్సెప్ట్స్ అమలు చేయనున్నారట. సీజన్ 7 మాదిరి రెండు లాంచింగ్ ఎపిసోడ్స్ ఉంటాయట. మొదట కొందరు కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపి, ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మిగిలిన కంటెస్టెంట్స్ ని పంపుతారట. ఇది సక్సెస్ ఫార్ములా కావడంతో ఫాలో కానున్నారట. 
 

Varun Sandesh


వీటన్నింటికీ మించిన అనూహ్య పరిణామం ఏమిటంటే... బిగ్ బాస్ తెలుగు 8లో రెండు జంటలు ఎంట్రీ ఇస్తున్నాయట. గతంలో హీరో వరుణ్ సందేశ్ భార్య వితికా షేరుతో పాటు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. తెలుగులో భార్యాభర్తలుగా షోకి వచ్చిన మొదటి జంట వీరిద్దరూ. 
 

Bigg Boss Telugu 6

సీజన్ 6లో సీరియల్ నటి మెరీనా తన భర్త రోహిత్ పాటు పార్టిసిపేట్ చేశారు. సీజన్ 7లో మాత్రం భార్యాభర్తలు ఎవరూ పాల్గొనలేదు. సీజన్ 8లో బుల్లితెర, వెండితెర సెలెబ్స్ గా ఉన్న రెండు జంటలు హౌస్లో అడుగుపెట్టబోతున్నాయట. వారికి సపరేట్ గదులు కూడా కేటాయిస్తారట. ఈ జంటల మధ్య మసాలా కంటెంట్ చోటు చేసుకునే అవకాశం కలదంటున్నారు.

Bigg Boss Telugu 8

ఎటూ దంపతులు కాబట్టి ముద్దులు, హగ్గుల మీద అభ్యంతరాలు వ్యక్తం కాకపోవచ్చనే వాదన తెరపైకి వచ్చింది. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. ఇక వరుసగా ఆరవసారి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని సమాచారం. 
 

Latest Videos

click me!