Tolllywood top 10 heroes
ఒక హీరో స్టార్డం అతని మార్కెట్, ఫ్యాన్ బేస్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. టాలీవుడ్ ప్రస్తుతం డజనుకు పైగా టాప్ హీరోలు ఉన్నారు. వీరిలో చాలా మందికి ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థ ఏప్రిల్ 24 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడించింది. తెలుగు మోస్ట్ పాప్యులర్ మేల్ స్టార్స్ పేరిట జరిగిన సర్వే లో కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అభిప్రాయం ఆధారంగా ఈ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మరి ఆడియన్స్ అభిప్రాయంలో టాప్ 10 హీరోలు ఎవరో చూద్దాం...
Vijay Devarakonda
విజయ్ దేవరకొండకు ఆడియన్స్ 10వ ర్యాంక్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ టైర్ 1 హీరో కాదు. ఈ మధ్య వరుస ప్లాప్స్ పడుతున్నాయి. అయినా ఆయనకు టాప్ 10లో చోటు దక్కింది.
సీనియర్ స్టార్స్ లో చిరంజీవి మాత్రమే ఇప్పటికీ సత్తా చాటుతున్నాడు. వందల కోట్ల వసూళ్లు కొల్లగొడుతున్నారు. ఆయనకు 9వ ర్యాంక్ దక్కింది. నెక్స్ట్ విశ్వంభర టైటిల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
మాస్ మహరాజ్ రవితేజకు ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు. అయిన ఆయనకు ఇండియా వైడ్ ఫేమ్ ఉంది. దాంతో ప్రేక్షకులు ఆయనకు 8వ ర్యాంక్ ఇచ్చారు.
ఇక 7వ ర్యాంక్ హీరో నానికి దక్కింది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం టైర్ 2 హీరోల్లో నానినే నెంబర్ వన్. దసరా, హాయ్ నాన్న విజయాలతో నాని జోరు మీదున్నారు.
Pawan Kalyan
అనూహ్యంగా 6వ ర్యాంక్ కి పడిపోయారు పవన్ కళ్యాణ్. గత రెండేళ్లుగా రాజకీయాల్లో బిజీ అయ్యారు. అందుకే ఆయనకు టాప్ 5లో చోటు దక్కలేదు. ఇటీవల ఆయన నటించిన భీమ్లా నాయక్, బ్రో నిరాశపరిచాయి.
రామ్ చరణ్ కి 5వ ర్యాంక్ దక్కింది. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లు టాప్ 3లో లేకపోవడం ఊహించని పరిణామం. గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత రామ్ చరణ్ ర్యాంక్ మెరుగయ్యే అవకాశం కలదు.
Allu Arjun
4వ ర్యాంక్ అల్లు అర్జున్ కి దక్కింది. పుష్ప మూవీ అల్లు అర్జున్ రేంజ్ మార్చేసింది. ఆయన నటించిన పుష్ప 2 పై నార్త్ ఇండియాలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
నందమూరి హీరో ఎన్టీఆర్ కి 3వ ర్యాంక్ దక్కింది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో ఫేమ్ రాబట్టాడు. వార్ 2, దేవర చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆడియన్స్ 2వ ర్యాంక్ కట్టబెట్టారు. మహేష్ బాబు ఇంత వరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. అయినప్పటికీ ఆయన భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారని అర్థం అవుతుంది.
Tolllywood top 10 heroes
ఇక బాహుబలి స్టార్ ప్రభాస్ కి మూవీ లవర్స్ అగ్రస్థానం కట్టబెట్టారు. 1వ ర్యాంకు ఇవ్వడం ద్వారా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో ఆయనే అనే తేల్చేశారు. ప్రస్తుతానికి టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్. అయితే మిగతా హీరోల అప్ కమింగ్ చిత్రాల రిజల్ట్ ని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి.