సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన శ్రీదేవి కూతుళ్లు.. అందంలో అక్క జాన్వీనే మించిపోయిన చెల్లి.. నెటిజన్ల కామెంట్స్

First Published | Apr 3, 2023, 4:31 PM IST

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తాజాగా పంచుకున్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో చెల్లి ఖుషీ కపూర్ తో కలిసి దిగిన ఫొటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. 

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి కూతుర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ  సందడి చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన సినిమా విషయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూనే ఉంటుంది. 
 

అయితే శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ బ్యూటీ జాన్వీ  కపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాలతో దుమ్ములేపోతోంది. మరోవైపు బోల్డ్ అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తోంది. గ్లామర్ డోస్ పెంచుతూ పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాన్వీపై విమర్శలూ వచ్చాయి.
 


ప్రముఖ నటి శ్రీదేవి అభిమానులు ఆమె కూతురైనా జాన్వీ కపూర్ బోల్డ్ గా ఫొటోషూట్లు చేయడంపై మండిపడ్డ విషయం తెలిసిందే.  అయినా హాట్ నెస్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. అక్కను చూసి అటు చెల్లి ఖుషీ  కపూర్ (Khushi Kapoor) సైతం మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లు చేస్తూ వచ్చింది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గలేదు.
 

ఈక్రమంలో ఈ ఇద్దరు అక్కాచెళ్లెళ్లు తమ అభిమానులతో పాటు శ్రీదేవి అభిమానులకు షాకిచ్చారు. ఎప్పటినుంచో వీరిని సంప్రదాయ దుస్తుల్లో చూడాలని కోరుకుంటున్నారు. గతంలో జాన్వీ ఒకటి  రెండు మార్లు అచ్చమైన తెలుగమ్మాయిలా మెరిసింది.  మళ్లీ ఇప్పుడు చెల్లితో ఇలా ట్రెడిషనల్ లుక్ లోదర్శనమిచ్చింది.
 

జాన్వీ కపూర్, ఖుషీ  కపూర్ ను ఇలా చూసిన అభిమానులు ఖుషీ  అవుతున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఎంతలా బ్యూటీఫుల్ గా ఉన్నారోనంటూ కామెంట్లు పెడుతున్నారు.  మరికొందరైతే అక్క జాన్వీ కంటే చెల్లి ఖుషీ కపూరే చాలా బాగుందంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

ఈ ఫొటోలను పంచుకుంటూ జాన్వీ ‘హోమ్’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని క్యాప్షన్ గా ఇచ్చింది. ఏదేమైనా సీనియర్ నటి దివంగత  శ్రీదేవి అభిమానులకు అక్కాచెళ్లెళ్లను ఇంత పద్ధతిగా చూసి ఖుషీ  అవుతున్నారు. ఇక జాన్వీ  ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన NTR30లో నటిస్తోంది. ఖుషీ కపూర్ ‘ది ఆర్చీస్’తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతోంది.  

Latest Videos

click me!