Brahmamudi: కోడలి మీద నిందలు వేస్తున్న అపర్ణ.. అత్తకు సపోర్ట్ గా మాట్లాడి అందరికీ షాకిచ్చిన రాజ్!

Published : Apr 03, 2023, 03:33 PM IST

Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీ ఇస్తూ మంచి రేటింగ్ ని సంపాదిస్తుంది. మోసం చేసి పెళ్లి చేశారని కోపంతో కోడలి మీద అసహ్యాన్ని పెంచుకున్న ఒక అత్తగారి కథ ఈ సీరియల్. ఈరోజు ఏప్రిల్ 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
17
Brahmamudi: కోడలి మీద నిందలు వేస్తున్న అపర్ణ.. అత్తకు సపోర్ట్ గా మాట్లాడి అందరికీ షాకిచ్చిన రాజ్!

కావ్య కాలు మెలి పడటంతో రాజ్ ని ఎత్తుకొని ప్రదక్షిణ చేయమంటాడు సీతారామయ్య. పాపం ఆయనకు ఎందుకు శ్రమ ఇప్పుడు తగ్గిపోయిందిలెండి అంటుంది కావ్య. శ్రమ కాదమ్మా బాధ్యత, భర్త అంటేనే భరించేవాడని అర్థం అంటారు పంతులుగారు. చంకనెక్కడానికి రెడీగా ఉన్నావా వద్దని చెప్పు అంటాడు రాజ్. ఇంతసేపు ఇబ్బందిగా అనిపించి వద్దన్నాను. కానీ ఇప్పుడు పంతానికైనా ఎత్తుకోమంటాను అంటూ నొప్పి అని కేకలు వేస్తుంది కావ్య. నొప్పి ఎక్కువైనట్లుగా ఉంది ఎత్తుకొని ప్రదక్షిణ చేయు అని చిట్టి చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే చేస్తాడు రాజ్. అది చూసిన స్వప్న అసూయతో రగిలిపోతుంది. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఒకరికి పొగరు తగ్గించమని మరొకరు దేవుడికి దండం పెట్టుకుంటారు కావ్య, రాజ్.

27

ప్రసాద్ అన్ని తీసుకువచ్చిన పంతులుగారు ఇది విడివిడిగా ఇచ్చేది కాదు అమ్మవారికి పెట్టిన మహా నైవేద్యం ఒకరికి ఒకరు తినిపించుకోవాలి అంటారు. చిట్టి చెప్పిన మీదట ప్రసాదాన్ని తీసుకుని మెట్ల మీద కూర్చుంటారు రాజ్ తో పాటు మిగిలిన కుటుంబ సభ్యులందరూ. ఒకరికొకరు తినిపించుకోకుండా కూర్చున్న రాజ్ వాళ్ళని మందలిస్తుంది చిట్టి.ఈలోపుగానే స్వప్న ప్రసాదాన్ని కిందన పడేయాలని ప్రయత్నిస్తుంది. కానీ చేజారిన ప్రసాదాన్ని ఒడుపుగా పట్టుకుంటాడు రాజ్. మీ కాపురాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే అందుకే ఆ ప్రసాదాన్ని చేజారునివ్వలేదు. ఆ అమ్మాయి భవిష్యత్తు మన కుటుంబ పరువు ప్రతిష్టలు అన్ని నీ చేతుల్లోనే ఉన్నాయి అంటుంది చిట్టి. ఒకరికి ఒకరు ప్రసాదాన్ని తినిపించుకుంటారు.

37

అది చూసిన కనకం ఆనందంతో కన్నీరు పెట్టుకుంటుంది. స్వప్న, అపర్ణ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏడుస్తున్న కనకాన్ని ఓదార్చి ఇంకా ఇక్కడే ఉంటే ప్రమాదం అంటూ చెల్లెల్ని తీసుకొని అక్కడినుంచి వచ్చేస్తుంది మీనాక్షి. ఎదురుగా ఉన్న రాజ్ కుటుంబ సభ్యులను చూసి ఒక్కసారిగా షాకవుతారు మీనాక్షి, కనకం. మీనాక్షి తప్పించుకుంటుంది కానీ కనకం మాత్రం ఎదురెళ్ళి వాళ్లకి నమస్కరిస్తుంది. ప్రశాంతంగా గుడికి కూడా రానివ్వరా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏదో ఒక వంకతో ప్రత్యక్షమైపోతారా, ఇదే గుడికి ఈ సమయానికి వస్తున్నట్లుగా మీకు ఎలా తెలిసింది మీ అమ్మాయి చేరవేసింది కదా అంటూ నిలదీస్తుంది అపర్ణ. మీ ఫ్యామిలీ అంతా ఇంత ప్లాన్డ్ గా పని చేస్తూ ఉంటారా అంటూ కోపంగా మాట్లాడుతుంది. నా కూతురికి ఏమీ తెలీదు నాకే మనసు బాగోక ఇలా వచ్చాను కానీ మిమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాను అంటుంది కనకం.

47

అబద్దాలు చెప్పడానికే నీకు పెట్టింది పేరు నువ్వు నిజం ఎలా చెప్తావు అంటుంది అపర్ణ. మీరు గుడికి వచ్చినా కూడా తప్పు వెతుకుతారని నేను ఊహించలేదు అంటుంది కావ్య. ఇంటిగుట్టు బయట పడకూడదని నిన్ను ఇంట్లో పెట్టుకున్నాను అంతేగాని మీది గొప్ప చరిత్ర కలిగిన వంశమని కాదు. ఎక్కడపడితే అక్కడ ఎదురుపడి రాకపోకలు ప్రారంభిస్తే చీర సారె  పెట్టి మరీ పుట్టింటికి పంపించాల్సి ఉంటుంది అంటూ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. నామీద కోపాన్ని బిడ్డ మీద చూపించకండి ఆ దేవుడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను నిజంగానే మీరు వస్తున్నట్లు మాకు తెలియదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది కనకం. ఇది గుడి మన ఇల్లు కాదు ఇక్కడికి ఒకరిని రాకూడదు అనే హక్కు మనకి లేదు, ఫోన్ నీ దగ్గరే ఉంది కదా కళావతి వాళ్ళ అమ్మకి వార్తలు ఎలా చేరవేస్తుంది అంటూ తల్లిని నిలదీస్తాడు రాజ్. నువ్వేమీ కంగారు పడకు నీ కూతురు సంతోషంగా ఉంటుంది అంటూ ధైర్యం చెబుతుంది చిట్టి.

57

వాళ్లు వెళ్లిపోయాక వచ్చిన మీనాక్షి ఏం జరిగింది అని అడుగుతుంది. మొదటిసారి అల్లుడు గారు నాకు కావ్యకి  సపోర్ట్ గా మాట్లాడారు అంటే ఆయన మన కావ్యని భార్యగా ఒప్పుకున్నట్లే కదా అంటుంది కనకం. మరోవైపు గుళ్లో జరిగిన దానికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది స్వప్న. అంతలోనే అక్కడికి వచ్చిన రాహుల్ ఏం జరిగింది అని అడుగుతాడు. నువ్వు చెప్పిన దాని కన్నా 100 రెట్లు ఎక్కువ జరిగింది. అక్కడికి రాజ్ వాళ్ళు వచ్చారు నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను కానీ, మా చెల్లెల్లో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు. రాజ్ ఎంత వద్దు అనుకుంటున్నా కావ్య కావాలనే దగ్గర అవటానికి ట్రై చేస్తుంది. ఆఖరికి మా అమ్మ కూడా నన్ను అసహ్యించుకునేలాగా చేసింది.దాన్ని వదిలిపెట్టను అంటూ కోపంతో రగిలిపోతుంది స్వప్న.

67

మరోవైపు బంజరా హిల్స్ పోలీస్ ఎస్ఐ రాజ్ కి ఫోన్ చేసి రెండు రోజులు క్రితం మీ భార్య తన అక్క మిస్ అయినట్టుగా కేసు ఫైల్ చేసింది అని చెప్తాడు. నిజమా అని  రాజ్ అడగటంతో అవును సార్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆవిడ మీ భార్యని తెలియదు కానీ ఎంక్వయిరీ చేస్తున్నప్పుడు మీకు, కావ్య గారికి రీసెంట్ గా మ్యారేజ్ అయిందని తెలిసింది అందుకే నేను మీకు కాల్ చేస్తున్నాను అంటాడు ఎస్సై. మీ వైఫ్ కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది ఈ విషయాన్ని ఆవిడకి చెప్పండి. ఆచూకీ దొరకగానే మళ్లీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఎస్ఐ. అయితే  రాత్రి తను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందన్నమాట అనుకుంటూ ఆవేశంగా కావ్య గదికి వస్తాడు. లోపలికి అడుగుపెట్టడం ఎవరైనా చూస్తే మళ్లీ తనని అపార్థం చేసుకుంటారని వెనకడుగు వేస్తాడు.

77

తరువాయి భాగంలో రాత్రి ముసుగేసుకుని ఎక్కడికి వెళ్లావు అంటూ అందరి ముందు నిలదీస్తాడు  రాజ్. పోలీస్ స్టేషన్ కి అని చెప్తుంది కావ్య. పెళ్లిలోంచి వెళ్ళిపోయిన వాళ్ళ అక్క కనబడట్లేదని కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది అని అందరికీ చెప్తాడు  రాజ్. తను వెళ్ళిపోలేదు ఎవరో ట్రాప్ చేశారు తను దొరికితే అసలు నిజాలు బయటకు వస్తాయి అంటుంది కావ్య. అయితే తను కచ్చితంగా దొరుకుతుంది నేను తనని తీసుకురావడానికే వెళ్తున్నాను అంటూ బయటికి వెళ్ళిపోతాడు రాజ్.

click me!

Recommended Stories