Intinti Gruhalakshmi: ప్రియ సంజయ్ భార్య అని తెలుసుకున్న విక్రమ్.. ఒక్కటైన లాస్య రాజ్యలక్ష్మి?

Published : Mar 30, 2023, 09:30 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు మార్చి 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.  

PREV
19
Intinti Gruhalakshmi: ప్రియ సంజయ్ భార్య అని తెలుసుకున్న విక్రమ్.. ఒక్కటైన లాస్య రాజ్యలక్ష్మి?

ఈరోజు ఎపిసోడ్లో విక్రమ్ ప్రియని చూసి నువ్వు హాస్పిటల్ లో పనిచేస్తావు కదా ఇక్కడ ఉన్నావేంటి అసలు ఈ పూజలు ఏంటి అనడంతో ఇంతలో విక్రమ్ వాళ్ళ తాతయ్య అక్కడికి వచ్చి నేను చెప్తాను అని అంటాడు. ప్రియా హోదా మారిపోయింది ఇప్పుడు హాస్పిటల్ లో నర్స్ కాదు మన ఇంటి కోడలు నీ మరదలు అనడంతో విక్రమ్ షాక్ అవుతాడు. అమ్మ తాతయ్య చెప్పేది నిజమా అనగా అవును నాన్న అనడంతో ఇది ఎలా సాధ్యం అమ్మ అని అంటాడు విక్రమ్. నాకు చెప్పకుండా నేను ఊర్లో లేనప్పుడు ఈ రెండు రోజుల్లో ఇంత జరిగిందా అనడంతో అనుకోకుండా జీవితాలు తారుమారైనప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని అంటుంది రాజ్యలక్ష్మి.

29

అప్పుడు దేవుడు ఇప్పుడు నిజం తెలిస్తే దివ్యకి పోట్లాటకు వెళ్తారు ఏమో అని అనుకుంటూ ఉంటాడు. అంతా అయోమయంగా ఉందమ్మా ఏంట్రా సంజయ్ ఇది అని అంటాడు విక్రమ్. నీకు పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను అనడంతో అన్నయ్య తప్పు నాదే అన్నయ్య ప్రియ విషయంలో తొందర పడ్డాను తను తల్లి కాబోతోంది అనడంతో విక్రం షాక్ అవుతాడు. అన్యాయం జరుగుతోంది అనగా మమ్మీకి తెలియడంతో వెంటనే తాళి కట్టించింది అనగా విక్రమ్ రాజ్యలక్ష్మి గుడ్డిగా నమ్ముతూ నీ మనసు నాకు తెలుసమ్మా ఆడపిల్లకు అన్యాయం జరిగితే నువ్వు చూస్తూ ఊరుకోవు అని అంటాడు.
 

39

 నీ లాంటి తల్లి ఉండబట్టే ఇంకా ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తోంది అని రాజ్యలక్ష్మి పొగుడుతూ మాట్లాడుతాడు విక్రమ్. పిల్లలు తప్పు చేస్తే తల్లిదే బాధ్యత కానీ వెనకేసుకు రాకూడదు కదా నాన్న అంటున్న నాటకాలు ఆడుతూ ఉంటుంది రాజ్యలక్ష్మి. అది కరెక్టే అమ్మ ప్రియ ఎందుకు అమ్మవారికి అభిషేకం చేస్తోంది అనడంతో మధ్యలో బసవయ్య ఇన్వాల్వ్ అయ్యి రాజ్యలక్ష్మి నీ పొగుడుతూ ప్రియ చేస్తున్న పని గురించి వివరిస్తాడు. అప్పుడు ప్రియా కి దోషం ఉంది అని బసవయ్య చెప్పడంతో మొన్న ఏదో ప్రవచనాల్లో విన్నాను మావయ్య భార్యాభర్తల్లో దోషం ఎవరికి ఉన్న అది ఇద్దరికీ వర్తిస్తుంది కదా అని అంటాడు విక్రమ్.
 

49

ప్రియా అవుట్ హౌస్ లో ఉంటూ ఇలా ఒక్కటే కష్టపడుతుంటే చూస్తుంటే ఎలా సంజయ్ కూడా ప్రియ కి హెల్ప్ చేయాలి. నీళ్లు మోయాలి అవుట్ హౌస్ లో ఉండాలి అనడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు రాజ్యలక్ష్మి వీడేంటి ఇలా రెచ్చిపోతున్నాడు ఇప్పుడు కాదు అంటే నా ప్లాన్ అంతా తెలిసిపోతుంది అనుకుంటూ మౌనంగా ఉంటుంది. అప్పుడు విక్రమ్ సంజయ్ కి నీళ్లు పోయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు దివ్య నీకోసం నీకు ఇష్టమైన ఉప్మా పెసరట్టు చేశాను వెళ్లి స్నానం చేసిరా అనగా ఇంతలో లాస్య అక్కడికి వచ్చి నీకోసం ఎవరో బొకే పంపించారు దివ్య అని అనడంతో దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఫోన్ చేస్తే ఎత్తడు కానీ ఇలా బొకేల మీద బొకేలు పంపిస్తున్నాడు అని దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది.
 

59

ఉండు నేను పేరు చూసి చెప్తాను అనగా వద్దు ఆంటీ అని దివ్య లాస్య చేతిలో ఉన్న బొకేలు లాక్కోడానికి ప్రయత్నం చేయగా లాస్య తెలివిగా తులసి చేతిలో ఆ బొకే ని పెడుతుంది. అక్కడే ఆగు దివ్య నా దగ్గర నుంచి బొకేని లాక్కుంటావా పంపించింది ఎవరో పేరు చూసి నీకే ఇచ్చేస్తాను అని అంటుంది తులసి. ఇక్కడ పేరు ఏమీ లేదు దివ్య ఓన్లీ ఫ్రెండ్ అని మాత్రమే ఉంది అనగా దివ్య రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు లాస్య దివ్య వైపు చూసి నువ్వు ఆ విక్రం పంపించిన బొకే కోసం ఎదురుచూస్తున్నావ్ అని తెలుసు. నువ్వు విక్రంతో పీకల్లోతు ప్రేమలో ఉంటేనే కదా నా పని అయ్యేది అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దివ్య నాకు లోపలికి టిఫిన్ పంపించు అమ్మ అనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
 

69

ఇంతలో లాస్యకి వాళ్ళ ఫ్రెండ్ పద్మ ఫోన్ చేసి మన బిజినెస్ లో పెట్టిన డబ్బు మొత్తం పోయింది అనడంతో లాస్య షాక్ అవుతుంది. ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మొత్తం అంతా పోయింది ఇదే విషయం అందుకు తెలిస్తే నా పీక పిసికేస్తాడు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు విక్రమ్ టెన్షన్ పడుతూ ఏం జరిగింది దేవుడు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఏమి మాట్లాడవేంటి అని నిలదీస్తాడు. అప్పుడు దేవుడు ఒకటి అడుగుతాను చెప్పండి బాబు మీకు దివ్యమ్మ అంటే ఎంత ఇష్టం అని అడుగుతాడు. అప్పుడు దివ్య మీద తనకున్న ఇష్టాన్ని చెబుతూ ఉంటాడు. నాకు అమ్మ మాట అమ్మ ప్రేమ తర్వాత నేను అంతగా ఇష్టపడితే దివ్యని మాత్రమే అని అనడంతో ఇప్పుడు నీకు అదే సమస్యగా మారబోతోంది బాబు అని మనసులో అనుకుంటూ ఉంటాడు దేవుడు.
 

79

 నీ కోసం ఈ డైమండ్ రింగు తీసుకొని వచ్చాను నేను ఇంతలా ప్రిపేర్ అయినప్పుడు దివ్య పెళ్లి విషయంలో ఎందుకు నేను వెనకడుగు వేస్తాను అనుకుంటున్నావు అనడంతో ఒకవేళ మీ ప్రేమకు పెద్దమ్మ అడ్డం పడితే అనగా అడ్డుపడదు నేనంటే అమ్మకి ఇష్టం అమ్మని ఒప్పించి నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు విక్రమ్. అప్పుడు దేవుడు పెద్దమ్మ గారి ప్రేమ దివ్యమ్మ గారి ప్రేమ ఇద్దరిలో ఏదో ఒకటి తేల్చుకునే పరిస్థితి వస్తే అనగా ఆ పరిస్థితిని నేను ఎప్పటికీ ఊహించుకోలేను అని అంటాడు విక్రమ్. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అని అంటాడు విక్రమ్. దివ్యతో మాట్లాడి చాలాసేపు అయింది దివ్యతో మాట్లాడాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

89

దేవుడు అసలు విషయం చెప్పకుండా లోలోపల టెన్షన్ పడుతూ ఉంటాడు. మరోవైపు దివ్య విక్రమ్ ఫోన్ కాల్ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు లాస్య దివ్యని గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు తులసి వచ్చి టిఫిన్ చెయ్యమ్మా అందంతో వస్తున్నాను మా అనగా 10 నిమిషాల నుంచి అదే మాట చెబుతున్నావు వచ్చింది లేదు పెట్టింది లేదు అని అంటాడు పరంధామయ్య. ఇక్కడికి వస్తే ఇదే దివ్య స్వరూపం బయటపడుతుంది ఏమో అని లాస్య అనడంతో దివ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అనుమానం రాకుండా చేయాలి అని దివ్య చూడమ్మా ఇలా మాట్లాడుతున్నారు అనడంతో సరదాగా అంటున్నారు లేమ్మా నువ్వు వచ్చి భోజనం చేయి అని అంటుంది. అప్పుడు నా మొబైల్ ఫోన్ ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది అని దివ్య వైబ్రేషన్ లో పెట్టి సెల్లు తన దగ్గరే పెట్టుకుంటుంది.

99

మరోవైపు విక్రమ్ ఇన్ని మెసేజ్లు పెట్టింది ఏంటి ఇక లాభం లేదు ఫోన్ చేయాల్సిందే అని ఫోన్ చేస్తాడు. దివ్య భోజనం చేస్తుండగా సెల్లు వైబ్రేట్ కావడంతో అసలు లోపల ఉండగా వైబ్రేషన్ కి ఉలిక్కి పడుతుంది. దివ్య ఫోన్ కట్ చేయడంతో విక్రం పదేపదే ఫోన్ చేస్తూ ఉంటాడు. తర్వాత దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి నడుము దగ్గర సెల్లు పెట్టుకుంటే పదేపదే మీరు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు చెక్కలిగింతలు పెడుతున్నాయి అనడంతో ఏం మాట్లాడుతుందో అర్థం కాక విక్రమ్ అయోమయపడుతూ ఉంటాడు. అప్పుడు దివ్య అసలు విషయం చెప్పడంతో నాకు అర్థమైంది అని అంటాడు విక్రమ్. అప్పుడు ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత దివ్య ఫోన్ మాట్లాడి అక్కడి నుంచి బయలుదేరుతుండగా లాస్య అక్కడికి వచ్చి దివ్య మాటలు అన్నీ వింటూ ఉంటుంది. అప్పుడు దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రాజ్యలక్ష్మి ఫోన్ చేసి లాస్యను తన ఇంటికి రమ్మని పిలుస్తుంది.

click me!

Recommended Stories