అప్పుడు వెళ్లి బ్రష్, స్నానం కూడా మీ తులసి ఆంటీని చేయంపించమనొచ్చు కదా అని సామ్రాట్ అనగా కుళ్ళుకోవద్దు నాన్న అని నవ్వుతూ అంటుంది హనీ. ఆ తర్వాత ఇద్దరూ రెడీ అవుతారు రెడీ అయి హనీ ఆకలేస్తుంది నేను తింటాను అని అంటుంది. ఆ తర్వాత సీన్లో తులసి,తులసి కోటకు పూజ చేస్తూ ఈరోజు భూమి పూజ అమ్మ.అంతా మంచే జరిగేటట్టు చెయ్యు, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. ఇలాగే కొనసాగాలని నీ దీవెనలు నాకు ఇవ్వు అని అంటుంది. అదే సమయంలో లాస్య అభికి ఫోన్ చేస్తుంది. మీ అమ్మ ఏం చేస్తుంది అని అనగా ఇలాగా భూమి పూజ బాగా జరగాలని దేవుని ప్రార్థిస్తుంది అని అంటాడు.