తన యాటిట్యూడ్ యువతకి బాగా నచ్చింది అనే ఉద్దేశంతో విజయ్ దేవరకొండ మరీ అతిగా బిహేవ్ చేస్తున్నాడు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. మొత్తంగా పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ సంవత్సరం కష్టం వృధా అయింది. లైగర్ మూవీ డిజాస్టర్ కావడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ నత్తిగా నటించడం, హీరోయిన్ సెట్ కాకపోవడం, పాటలు, బిజియం ఇలా చాలా మైనస్ లు ఉన్నాయి.