ఇంత రాత్రి ఏడుస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అని సత్య చూడడానికి వెళ్తుంది. అప్పుడు ఆదిత్య, రుక్మిణి ఆదిత్య పెళ్లి ఫోటో చూసి ఈ ఫోటో దేవికి చూపించాలి. నేనే తన తండ్రి అని చెప్పేయాలి నా భార్య పిల్లల్ని ఇంటికి తీసుకురావాలి అని అనుకుంటాడు.అప్పుడు ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేసి, దేవిని నేను చెప్పిన ప్రదేశానికి తీసుకురా ఈరోజు నేనే దేవి తండ్రి అని చెప్పేస్తాను, దేవి బయటకి వస్తున్నట్లు మాధవ్ కి చెప్పొద్దు అని అంటాడు. సరే అని చెప్పి దేవి దగ్గరికి వచ్చేసరికి దేవి రుక్మిణి తీసుకువెళ్లి అమ్మ నేను నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను పద అని ఆ తాగుబోతు ఉన్న చోటుకి తీసుకెళ్తుంది. అమ్మ ఇతనే కదా మన నాన్న నిజం చెప్పమ్మా.