ఈరోజు ఎపిసోడ్ లో తులసి మీరు ఇంత రౌడీ అనుకోలేదు అనగా అది ఏంటి హీరో ఇజం కాదా అనగా తులసి నవ్వుకుంటూ ఉంటుంది. హీరో, విలన్ అన్నమాట పక్కన పెడితే నేను మీ ఫ్రెండ్ ని ఎటువంటి సిచువేషన్స్ లో అయినా నేను మీకు తోడుంటాను విడిచి పెట్టే ప్రసక్తే లేదు అని అంటాడు సామ్రాట్. ఇప్పుడు సామ్రాట్ ఈ ఇంట్లోకి వెళ్లి మీ జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకోండి ఒక కొద్దిసేపు ఎవరి గురించి ఏది ఆలోచించకండి అని అంటాడు. ఆ తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరూ లోపలికి వెళ్లి ఇల్లు మొత్తం చూస్తూ ఉంటారు. అప్పుడు ఆ ఇంట్లోనే జ్ఞాపకాలను తులసి సామ్రాట్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది.