Bala Aditya: చందమామలా ఉన్న బిగ్ బాస్ బాల ఆదిత్య కూతురు... బారసాల వేడుకలో కంటెస్టెంట్స్ సందడి!

Published : Dec 16, 2022, 10:17 AM ISTUpdated : Dec 16, 2022, 10:28 AM IST

బిగ్ బాస్ ఫేమ్ బాల ఆదిత్య ఇంటిలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది . ఆయన చిన్న కుమార్తె బారసాల వేడుకకు కంటెస్టెంట్స్ హాజరై సందడి చేశారు.   

PREV
16
Bala Aditya: చందమామలా ఉన్న బిగ్ బాస్ బాల ఆదిత్య కూతురు... బారసాల వేడుకలో కంటెస్టెంట్స్ సందడి!
Bigg Boss Telugu 6

బిగ్ బాస్(Bigg Boss Telugu 6) హౌస్లో రేలంగి మామయ్యగా పేరు తెచ్చుకున్నారు బాల ఆదిత్య. వయసులో, అనుభవంలో మిగతా వారి కంటే పెద్దవాడైన బాల ఆదిత్య అదే హుందాతనం చూపించాడు. విషయం ఏదైనా సమయస్ఫూర్తితో మాట్లాడేవాడు. సహనం కోల్పోకుండా సమాధానం ఇచ్చేవాడు. ఇంటి సభ్యులకు మంచి మాటలు చెప్పేవాడు. 

26
Bigg Boss Telugu 6

అలా హౌస్లో మంచిగా ఉండటం హోస్ట్ నాగార్జునకు నచ్చలేదు. నువ్వు ఆట ఆడకుండా ఇతరులను కూడా చెడగొడుతున్నావని నాగార్జున బాల ఆదిత్యపై తీవ్రస్థాయి విమర్శల దాడి చేశారు. నీ గేమ్ సరిగా లేదంటూ నిలబెట్టి క్లాస్ పీకాడు. బాల ఆదిత్య హౌస్లో ఉన్నన్నాళ్లు నాగార్జున బాల ఆదిత్యను టార్గెట్ చేయడం జరిగింది. దాని వెనుక కారణం తెలియదు.

36
Bigg Boss Telugu 6

టీచర్ కూడా అయిన బాల ఆదిత్య(Bala Aditya) తాను స్మోకర్ గా బయటకు ప్రొజెక్ట్ కావడం తట్టుకోలేకపోయాడు. సిగరెట్ కోసం గీతూతో గొడవపడటం ఆయనపై నెగిటివిటీ తీసుకొచ్చింది. ఎంత బ్రతిమిలాడుకున్నా గీతూ...  బాల ఆదిత్య సిగరెట్లు, లైటర్ ఇవ్వలేదు. ఆ క్రమంలో బాల ఆదిత్య బరస్ట్ అయ్యాడు. 
 

46
Bigg Boss Telugu 6

హౌస్లో జెంటిల్మెన్ గా పేరు తెచ్చుకున్న బాల ఆదిత్య 10వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ ని బాల ఆదిత్య చాలా హుందాగా తీసుకున్నారు. ఎమోషన్స్ చూపించకుండా బయటకు వెళ్ళిపోయాడు. కాగా బాల ఆదిత్య ఇంట్లోకి వచ్చే ముందు భార్య రెండో కూతురికి జన్మనిచ్చారు. కూతురు పుట్టిన వెంటనే బాల ఆదిత్య హౌస్లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది.

56
Bigg Boss Telugu 6

దీంతో కూతురికి పేరు పెట్టలేదు. మంచి ముహూర్తం కుదరడంతో డిసెంబర్ 15న బాల ఆదిత్య రెండో కూతురి బారసాల కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. సూర్య గీతూ, ఇనయా(Inaya), ఆరోహిరావు,వాసంతి బాల ఆదిత్య కూతురు బారసాల వేడుకకు హాజరయ్యారు. 
 

66
Bigg Boss Telugu 6


ఇక బాల ఆదిత్య కూతురు చందమామ కంటే అందంగా ఉంది. యజ్ఞ విధాత్రి అని పేరు పెట్టారు. ఈ హ్యాపీ మూమెంట్స్, ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. 
 

Read more Photos on
click me!

Recommended Stories