Intinti Gruhalakshmi: తులసితో ఛాలెంజ్ చేసిన లాస్య.. లాస్యకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన తులసి?

First Published Jan 14, 2023, 11:57 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
 

 ఈరోజు ఎపిసోడ్లో సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఎందుకురా అబద్ధం చెప్పడం అనగా అబద్ధం ఏంటి బాబాయ్ అనడంతో నువ్వు ప్రాజెక్టు గురించి ఆలోచించలేదు గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు. నువ్వు తులసి గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్, బంగారం లాంటి అవకాశం దూరం చేసుకున్నావు తులసి వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నప్పుడే నీ మనసులో మాట చెప్పేయాల్సింది అనడంతో ఏం చెప్పాలి బాబాయ్ అని సామ్రాట్ అడగగా నువ్వు తనని ఇష్టపడుతున్నావు అనడంతో సామ్రాట్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుని వెళ్ళిపోతావు అని వాళ్ళ బాబాయ్ అంటాడు.

నువ్వు చెప్పినట్టు చేసి ఉంటే తులసి గారి జీవితంలో నమ్మకం చూసేవారు కాదు అని అంటాడు. తులసి గారి మనవనే తన మనసులో మాట చెప్పారు నేను తనకు ఆత్మబంధువు అని, తనక జీవితంలో మళ్లీ రెండో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పేసారు బాబాయ్ అంటాడు. అన్ని కలలు నిజం అవ్వవు కదా బాబాయ్ అనడంతో నువ్వు తులసి విషయంలో కలగనలేదు అది నిజం అని అంటాడు సామ్రాట్ వల్ల బాబాయ్. తులసి ప్రేమ విషయంలో ప్రేమ చంపేసుకుంటావా అనగా ఎందుకు చంపేసుకుంటాను బాబాయ్ దాచేసుకుంటాను అని అంటాడు. బయటపడకుండా నాలో నేను దాచుకుంటాను తులసి గారికి తెలియనివ్వకుండా చేస్తాను అని అంటాడు. తర్వాత శృతి కిచెన్ లో సామాన్లు సర్దుతూ ఉండగా ఇంతలో పనిమనిషి రాములమ్మ వచ్చి సామాన్లు అందిస్తూ ఉంటుంది.
 

 అప్పుడు రాములమ్మను చూసి శృతి ఒక్కసారిగా సంతోషపడడుతూ ఆశ్చర్యపోతుంది.  మీకు మూడు నెలలు అంట కదా ఇలాంటి బరువు పనులు చేయకూడదు ఆనంతో నీకెలా తెలుసు అనగా నాకు అన్ని తెలుసమ్మా ఆ లాస్య అమ్మ కుళ్ళు కుతంత్రాలు ఇంకా మానలేదు అంట కదా అని వాగుతూ ఉంటుంది.. నిన్ను ఎవరి పిలిచారు అనగా ఎవరో పిలిస్తే నేనెందుకు వస్తాను తులసి అమ్మ పిలిచింది. నేను లేకపోతే ఆ అమ్మకి కాళ్లు చేతులు ఆగవు అని అంటుంది. నా కాళ్ళు చేతులు ఆడటం కాదే నీ నోరు ఆగకుండా చూసుకో నోటికి ప్లాస్టర్ వేస్తాను అనగా వద్దమ్మా అని అంటుంది. అప్పుడు వాళ్ళు సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటీ పనులన్నీ నేను చూసుకుంటాను నీకు సంబంధించిన పనులని రాములమ్మ చూసుకుంటుంది. అనడంతో వద్దులే ఆంటీ నా పనులు నేను చూసుకుంటాను.

రాములమ్మను ఇంటి పనులు చూసుకోమని చెప్పండి అంటుంది శృతి. అప్పుడు రాములమ్మ మీకు ఇప్పుడే ఆపిల్ జ్యూస్ ఇస్తాను అని ఫ్రిడ్జ్ డోర్ తిరగడానికి వెళ్లగా అప్పుడు ఫ్రిడ్జ్ లాక్ చేసి ఉంటుంది. అదేంటి తాళం వేసి ఉంది అనడంతో లాస్య ఆంటీ ఇంకా మారలేదు అని అంటుంది శృతి. ఏం కావాలన్న తనని అడిగి పర్మిషన్ తీసుకొని తినాలి చేయాలి అంటే అనడంతో తులసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడు తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు లాస్య ఒంటరిగా ఆలోచిస్తూ ఏంటి నా సొంతం చేసుకొని అందర్నీ ఒక ఆట ఆడుకుందాము అంటే తులసి వచ్చి నా ప్లాన్ మొత్తం చెడగొట్టింది బెనర్జీ ప్రాజెక్ట్ చేయి జారిపోయేలా ఉంది అనుకుంటూ ఉండగా తులసి కోపంతో లాస్య వైపు రావడం చూసి నామీద యుద్ధానికి వస్తున్నట్టు ఉంది తగ్గకూడదు అనుకుంటూ ఉంటుంది.
 

ఇంతలోనే లాస్య దగ్గరికి తులసి వస్తుంది. అప్పుడు తులసిని చూసి లాస్య ఇంటి తాళాలు కనిపించకుండా దాచిపెట్టడంతో మర్యాదగా ఇస్తే బాగుంటుంది లాస్య అనగా బెదిరిస్తున్నావా అనడంతో నేను అడిగింది నువ్వు కొంగున కట్టుకున్న నా మాజీ మొగుడిని కాదు నీ కొంగు చాటున ఉన్న తాళాలు గుత్తుని అంటుంది తులసి. మర్యాదగా ఇస్తే వెళ్ళిపోతాను అనగా లేకపోతే ఏం చేస్తావు అనడంతో బలవంతంగా తీసుకొని వెళ్లాల్సి వస్తుంది అంటూ లాస్య దగ్గర ఉన్న ఇంటి తాళాలు తీసుకోవడంతో ఏ అని గట్టిగా అరుస్తుంది లాస్య. తులసి ఏమాత్రం తగ్గకుండా ఏయ్ అంటూ వేలు చూపిస్తుంది. తులసి మర్యాదగా ఆ ఇంటి కిస్ ఇవ్వు అనడంతో నేను వచ్చింది ఒక్కొక్కటి నీ దగ్గర నుంచి లాక్కోవడానికి తిరిగి ఇవ్వడాలు ఉండవు అని అంటుంది.
 

 ఇప్పటివరకు నువ్వు మారతావని సహించాను భరించాను కానీ నీ ఆగడాలు ఎక్కువ అయ్యేసరికి నేనే బరిలోకి దిగాను అంటుంది తులసి. నా కుటుంబం జోలికి వచ్చి నా పిల్లలను హింసిస్తున్నావు అత్తయ్య మామయ్యలను సరిగా తిండి లేక హింసిస్తున్నావు అని అంటుంది తులసి. నీ అహంకారం నీ పొగరే నన్ను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేలా చేసింది అని అంటుంది తులసి. అప్పుడు తులసి తో లాస్య వాదిస్తూ ఉండగా లాస్యకు తగిన విధంగా బుద్ధి చెబుతుంది తులసి. నీ పిల్లలకు తల్లిగా ఇంటికి కోడలుగా అందరి మనసులు గెలుచుకొని అందరిని నా గుప్పెట్లో పెట్టుకుంటాను అనడంతో అది నీ వల్ల కాదు అని తులసి చాలెంజ్ చేస్తుంది. అసలు నీ బిడ్డనే నువ్వు సరిగ్గా పెంచలేక ఎక్కడో పెంచుతున్నావు అలాంటిది నా బిడ్డలకు నువ్వు తల్లి ఎలా అవుతావు అని అంటుంది తులసి. అప్పుడు తులసితో ఛాలెంజ్ లు చేస్తూ ఉండగా తులసి లాస్యకు తగిన విధంగా బుద్ధి చెబుతూ ఉంటుంది.
 

ఆఖరి నిమిషంలో ఆఫర్ ఇస్తున్నాను ఓడిపోయాను అని ఒప్పుకొని బుద్ధిగా ఇంట్లో ఒక మూలన నీ భర్త తలదాచుకోండి నా జీతంతో మిమ్మల్ని పోషిస్తాను అని అంటుంది తులసి. నిన్ను తల దించుకునేలా నేను చేస్తాను అని అనడంతో అది చూద్దాం అని తులసి ఇది చాలెంజ్ కు నేను రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా చూపిస్తా అని లాస్య గట్టిగా అరవడంతో చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తులసి. మరొకవైపు ప్రేమ్ పాటలు పాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. అప్పుడు ప్రేమ్ ఉండమ్మా గిటార్ తెచ్చుకొని పాడుతాను అని అక్కడి నుంచి వెళుతూ మధ్యలో ఆగిపోతాడు. ఏమైంది ప్రేమ్ అనడంతో గిటార్ వద్దమ్మా ఇలాగే పడతాను అని అంటాడు. 
 

అప్పుడు ప్రేమ గిటారు తాకట్టు పెట్టిన విషయాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. గిటార్ తో పాడితే ఆ ఆనందమే వేరు ఉండు నేను తీసుకొస్తాను అని తులసి అక్కడ నుంచి వెళ్తుండగా అమ్మ వద్దమ్మా అని అంటాడు ప్రేమ్. గిటార్ ఎక్కడ అని అడిగితే అమ్మాను అని చెబితే అమ్మ బాధపడుతుంది అనుకుంటూ ఉండగా ఇంతలో తులసి గిటార్ తీసుకొని రావడంతో అది చూసి ప్రేమ్ ఆశ్చర్యపోతాడు. గిటార్ ని చూసి ఒకసారి కన్నీళ్లు పెట్టుకుంటాడు ప్రేమ్. అప్పుడు తులసిని పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు ప్రేమ్. అప్పుడు తులసి, ప్రేమ ఇద్దరూ ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు..

click me!