sankranti 2023 : మెగాస్టార్ వర్సెస్ బాలయ్య.. సంక్రాంతి బరిలో 11 సార్లు పోటీ పడ్డ స్టార్ హీరోలు

First Published Jan 14, 2023, 11:03 AM IST

ఈ ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య పోటీపడ్డారు. విజయం ఎవరిది అనేది పక్కన పెడితే.. ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఈ ఇద్దరు హీరోలు దాదాపు 11సార్లు సంక్రాంతి బరిలో సై అన్నారు. మరి ఇన్నేళ్ల పొంగల్ వార్ లో విన్నర్ ఎవరంటే..?

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం  నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరోల క్రేజ్ గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ హీరోల  ఫ్యాన్స్ మధ్య జరిగే వార్.. వీరి మధ్య ఉండే పోటీ మరే హీరోల మధ్య ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయంటే.. ఇక ఫ్యాన్స్ కు పండగే. అంతే కాదు బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు పోటాపోటీ పడుతుంటే.. బయట వీరిద్దరి ఫ్యాన్స్ బాహాబాహీ తలపడుతుంటారు. ఈక్రమంలో ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డితో బాలయ్య.. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి సంక్రాంతిబరిలో దిగారు. సంక్రాంతికి వీరిద్దరు చాలా సార్లు తలపడ్డారు. మరి గతంలో సంక్రాంతి బరిలో వీరు పోటీపడ్డ సినిమాలేంటో చూద్దాం. 

ఆ సినిమా తరువాత రెండేళ్లు వీరు తలపడలేదు. ఆతరువాత  1987లో చిరంజీవి దొంగమొగుడు సినిమాతో సంక్రాంతి బరిలో నిలవగా..  బాలకృష్ణ బార్గవ రాముడు సినిమాతో సై అంటూ సంక్రాంతి బరిలోకి వచ్చారు. దొంగ మొగుడు మూవీ జనవరి 9న విడుదలైంది. అటు  బాలకృష్ణ భార్గవరాముడు  సినిమా జనవరి 14న  రిలీజ్అయ్యింది. అయితే ఈరెండు సినిమాలు  కోదండరామిరెడ్డినే దర్శకత్వం వహించడం విశేషం. ఈ రెండు సినిమాలు  బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యాయి.  వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
 

ఆ సినిమా తరువాత రెండేళ్లు వీరు తలపడలేదు. ఆతరువాత  1987లో చిరంజీవి దొంగమొగుడు సినిమాతో సంక్రాంతి బరిలో నిలవగా..  బాలకృష్ణ బార్గవ రాముడు సినిమాతో సై అంటూ సంక్రాంతి బరిలోకి వచ్చారు. దొంగ మొగుడు మూవీ జనవరి 9న విడుదలైంది. అటు  బాలకృష్ణ భార్గవరాముడు  సినిమా జనవరి 14న  రిలీజ్అయ్యింది. అయితే ఈరెండు సినిమాలు  కోదండరామిరెడ్డినే దర్శకత్వం వహించడం విశేషం. ఈ రెండు సినిమాలు  బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యాయి.  వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

మళ్లీ ఏడాది గ్యాప్ తీసుకున్న ఈ ఇద్దరు హీరోలు  1988 మళ్లీ సంక్రాంతి బరిలో పోటీపడ్డారు. చిరంజీవి ఈసారి మంచి దొంగ సినిమాతో సంక్రాంతి బరిలో సందడి చేశారు. బాలయ్య ఇన్ స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో సై అన్నారు. మంచి దొంగ సినిమా  జనవరి 14న ఇది విడుదలైంది. ఈ సినిమాకు కే రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.  ఇన్‌స్పెక్టర్ ప్రతాప్  ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేయగా.. ఈసినిమా జనవరి 15న రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 

1989లో మళ్లీ సంక్రాంతి బరిలో నిలిచారు మెగాస్టార్ , బాలయ్య. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీతో మెగాస్టార్ . భలేదొంగ చిత్రంతో బాలయ్య బరిలో నిలిచారు. జనవరి 10న భలేదొంగ విడుదల ఓ మాదిరి హిట్‌ను సాధించింది. జనవరి 14న అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ రెండు చిత్రాలకు కూడా కోదండరామిరెడ్డినే దర్శకత్వం వహించడం మరో విశేషం.

ఈ సారి ఫ్యామిలీ సెంటిమెంటును నమ్ముకుని ఈ అగ్రహీరోల సంక్రాంతి బరిలో నిలిచారు. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత సంక్రాంతి సీజన్‌లో తలపడ్డారు. 1997 జనవరి 4న హిట్లర్ చిత్రంతో చిరంజీవి సందడి చేశారు. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ దర్శకత్వం వహించారు. మరోపక్క బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాతో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహించారు.ఈ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి.
 

మళ్లీ రెండేళ్ల వరకూ వీరిమధ్య పొంగల్ పోటీ లేదు. రెండేళ్ల తరువాత  బాలయ్య-చిరంజీవి సంక్రాంతి పండగకు పోటీ పడ్డారు. చిరంజీవి స్నేహంకోసం సినిమాతో న్యూ ఇయర్ సందర్భంగా  జనవరి 1న బరిలో దిగగా.. సమరసింహారెడ్డి సినిమాతో బాలయ్య సమరశంఖంపూరించారు. స్నేహం కోసం సినిమా  కేఎస్ దర్శకత్వంలో తెరకెక్కగా.. బి.గోపాల్ సమరసింహారెడ్డిని తెరకెక్కించారు. ఈ సినిమా జనవరి 13న విడుదలైంది. అయితే ఈ రెండింట్లో సమరసింహారెడ్డి సూపర్ హిట్టవగా.. స్నేహంకోసం చిత్రం మాత్రం యావరేజ్‌గా నిలిచింది.  సమరసింహారెడ్డి సినిమా మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది.  
 

1997లో దర్శకుల కాంబినేషన్ 2000లో మరోసారి తెరపైకి వచ్చింది. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య  మెగాస్టార్ చిరంజీవితో  అన్నయ్య  సినిమానుతెరకెక్కించగా.. శరత్ బాలయ్య బాబుతో శంశోద్దారకుడు సినిమాను రూపొందించారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. అన్నయ జనవరి 7న రిలీజ్అవ్వగా.. వంశోద్దారకుడు జనవరి 14న బరిలో నిలిచింది. కాకపోతే ఈరెండుసినిమాలుయావరేజ్ గానలిచాయి. 

మళ్ళీ ఏడాది గ్యాప్ తరువాత సంక్రాంతి ఫైట్ లో నిలిచారు చిరు.. బాలయ్య.  2001 జనవరి 11న చిరంజీవి మృగరాజు సినిమాతో సందడి చేశారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోపక్క అదే రోజున బాలకృష్ణ బీ గోపాల్ దర్శకత్వంలో నరసింహానాయుడుతో సందడి చేశారు. సమరసింహారెడ్డి కాంబో రిపీట్ కావడంతో నరసింహనాయుడు సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

చిరు-బాలయ్య. 2004  సంక్రాంతికి హోరా హోరీ పోటీపడ్డారు. అంజి సినిమాతో మెగాస్టార్ మరో ధారుణ పరాజయం అందుకున్నాడు.. అదే టైమ్ లో..  లక్ష్మీనరసింహ సినిమాతో బాలకృష్ణ విజయ విహారం చేశాడు.  అంజి సినిమాకు కోడీ రామకృష్ణ దర్శకత్వం వహిస్తే.. లక్ష్మీనరసింహా చిత్రానికి జయంత్ సీ పరాంజీ తెరకెక్కించారు.

ఈసారి మెగాస్టార్ సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇవ్వడంతో.. ఈకాంబోకు కూడా గ్యాప్ వచ్చింది. పొంగల్ కు బాలయ్య ఒక్కరే చాలా ఏళ్ళు ఏకైకా హీరో అనిపించుకున్నారు. ఇక 13 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో నిలిచారు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఇద్దరు స్టార్ హీరోలకు... వారి ఫ్యాన్స్ కు చాలా ప్రత్యేకంగా నిలిచాయి. ఇది చిరంజీవి నటించిన 150వ చిత్రం కాగా.. బాలకృష్ణకు 100 సినిమా కావడం విశేషం.  వివి వినాయక్ డైరెక్షన్ లో మెగాస్టార్  ఖైదీ నెంబర్ 150 తో సందడిచేయగా..  క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతోసందడి చేశారు.  ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వకపోయినా..  పాజిటివ్ టాక్ మాత్రం తెచ్చుకున్నాయి. 

veera simha reddy waltair veerayya north indian distribution rights bagged by pen marudhar

ఇక ఈఏడాది అంటే.. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి బాలయ్య-చిరంజీవి సంక్రాంతి బరిలో నిలిచారు. బాలయ్య వీరసింహారెడ్డి.. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు ఈ పొంగల్ కు పోటీపడ్డాయి. వీరసింహారెడ్డి సినిమాను మలినేని గోపీచంద్ డైరెక్ట్ చేయగా.. వాల్తేరు వీరయ్య సినిమాను బాబీ డైరెక్ట్ చేశారు. అయితే ఈ రెండు సినిమాలను మైత్రీ బ్యానర్ నిర్మించడం విశేషం

click me!