అప్పుడు తులసి వాళ్ళ కుటుంబం మొత్తాన్ని చూసి ఎప్పటికీ ఇలాగే ఉండేలా దీవించు తల్లి అని కోరుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత నందు లాస్య వాళ్ళు అక్కడికి రావడంతో తులసి వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు భాగ్యవాలు కావాలనే తులసి వాళ్ళకి ఎదురుగా బోనం వండుతూ తులసి వాళ్లకు వినిపించే విధంగా గట్టిగా మాట్లాడుతూ ఉండడంతో అప్పుడు అనసూయ, భాగ్య, లాస్య లకీ గట్టిగా కౌంటర్ ఇస్తుంది.