సావిత్రి కారణంగా కోట్లకు ఎదిగిన లలితా జ్యూవెల్లరీ అధినేత.. మహానటికి ఇష్టమైనదే ఫాలో కావడం వల్లేనా?

First Published Apr 19, 2024, 5:47 PM IST

మహానటి సావిత్రి కారణంగా ఎంతో మంది బాగుపడ్డారు. ఆమె సొమ్ము తిని కోట్లకు ఎదిగారు. అయితే సావిత్రి కారణంగా ఎదిగిన వారిలో లలితా జ్యూవెల్లరీ హోనర్‌ కిరణ్‌ కూడా ఉన్నారట. 

సావిత్రి తెలుగుతోపాటు సౌత్‌ చిత్ర పరిశ్రమల్లోనూ మహానటిగా ఎదిగింది. అద్భుతమైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. కోట్లాది మంది గుండెల్లో గూడు కట్టుకుంది. కానీ భర్త జెమినీ గణేషన్‌ కారణంగా ఆమె తన జీవితాన్ని నాశనం చేసుకుంది. మందుకి అలవాటై, అనారోగ్యానికి గురై విషాదంగా ఆమె జీవితం ముగిసింది. ఓ తారగా ఓ వెలుగు వెలిగి అంతలోనే ఆరిపోయింది.
 

ఆమె చనిపోయి చాలా ఏళ్లే అవుతున్నా, ఆమెపై చర్చ జరుగుతూనే ఉంది. ఆమె మరణం, కీర్తిప్రతిష్టలు ఇప్పటికీ మాముమోగుతూనే ఉన్నాయి. డెత్ మిస్టరీకి సంబంధించిన కథలు రకరకాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో వెర్షన్‌లో ఆమె గురించి చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా సావిత్రి కూతురు విజయ్‌ చాముండేశ్వరి తాను చూసి నిజాలను, అనుభవించిన నిజాలను బయటపెట్టింది. ఇటీవల మహానటి సావిత్రిపై ఓ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. 
 

అందులో భాగంగా సావిత్రికి సంబంధించి అనేక రహస్యాలను బయటపెట్టింది. సావిత్రి కూతురుగా విజయ చాముండేశ్వరి తాను స్వయంగా అనుభవించిన విషయాలను పంచుకుంది. అందులో భాగంగా సావిత్రి ఆస్తుల గురించి ప్రస్తావన తెచ్చింది. ఆ ఆస్తులు ఏమయ్యాయో చెప్పింది. ఎవరు ఎలా ఎదిగారో తెలిపింది. ఎవరు ఎలాంటి మోసాలు చేశారో తెలిపింది.

 సావిత్రి కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు పారితోషికం కింద లక్షల్లో డబ్బు వచ్చేదట. అప్పుడు వ్యాపారాలు లేకపోవడంతో ల్యాండ్‌లు, ఇళ్లు కొనిపెట్టిందట. అలా చాలా ఇళ్లు కొనిపెట్టిందన్నారు. చెన్నైలోని హబీబుల్లా రోడ్డులో మూడు ఇళ్లు, కొడైకెనాల్‌లో ఓ ఇళ్లు, హైదరాబాద్‌లోని యూసఫ్‌ గూడాలో రెండు ఇళ్లు కొన్నదట. 
 

తాను ఇంకా చాలా ఆస్తులు కూడబెట్టిందని కానీ అవన్నీ మోసానికి పోయాయని తెలిపారు. తనతో ఉన్నవాళ్లు, తనకు మంచిగా ఉంటూ ఎంతో మంది వెన్నుపోట్లు పొడిచారని, ఆస్తులన్నీ లాక్కున్నారని తెలిపారు. చాలా ఆస్తులు రిలేటివ్‌ల పేర్లతో కొనిపెట్టిందని, వాటిని వాళ్లే ఆక్యూపై చేసుకున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. 
 

హబీబుల్లా రోడ్డులో మూడు ఇళ్లు ఉన్నాయని, ఓ పెద్ద బంగ్లా ఉండేదని, ఐటీ వాళ్లు దాడిలో దాన్ని సీజ్‌ చేశారని, దానికోసం చాలా పోరాడాల్సి వచ్చిందని, ముప్పై ఏళ్లపాటు కేసులు తిరిగినట్టు తెలిపారు. కొన్ని ఆస్తులు అమ్మి ఇన్‌కమ్‌ ట్యాక్స్ కట్టినట్టు తెలిపారు. అలా హబీబుల్లా రోడ్డులోని పెద్ద బంగ్లా, పక్కన మూడు ఇళ్లు ఉండేవని, వాటిని కూల్చీ ఓ పెద్ద బిల్గింగ్‌గా కట్టామన్నారు. అయితే పంచుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని అమ్మేశారట. 
 

విజయ చాముండేశ్వరని, తనసోదరుడు పంచుకున్నట్టు తెలిపారు. ఆ క్రమంలో ఆ కొత్త బిల్డింగ్‌ని లలితా జ్యూవెల్లరీ హోనర్‌ కిరణ్‌ గుండుకి అమ్మేశారట. ఆయన కొన్ని రోజులు ఆ ఇంట్లోనే ఉండేవాడట. అలా అతనే ఆ ఇంటిని తీసుకున్నట్టు తెలిపారు. సావిత్రిగారిని ఆయన ఆరాధించే వారట. ఆమెని ఓ సెంటిమెంట్‌గా భావించేవారట.

ఆ ఇంటిని అమ్మాలనుకున్నప్పుడు తనే తీసుకున్నాడట. అందులో సావిత్రికి సంబంధించిన పెద్ద ఫోటో ఉండేదని, ఇప్పటికీ దాన్ని అలానే ఉంచుకున్నాడని, ఆ ఫోటో రూపంలో సావిత్రి తన ఇంట్లోనే ఉందని తని ఫీలవుతాడని తెలిపారు. తమ పట్ల ఆయన ఎంతో అభిమానంతో ఉంటాడని తెలిపారు. 
 

మరోవైపు ఆయన సక్సెస్‌ సీక్రెట్‌ చెబుతూ సావిత్రికి గోల్డ్ అంటే పిచ్చి, ఆమె షోరూమ్ లు ఓపెన్‌ చేసినప్పుడు తొలి బేరం తనే చేసేదని, గోల్డు చైన్స్ ని, గాజులు కొనేదట. బిరువా నిండా నగలే ఉండావని, ఇన్‌కమ్‌ టాక్స్ వాళ్లు మొదట దాని మీదే పడ్డారని, క్లాత్‌లో పెద్ద రాశిలాగా పోసి వాటిని తీసుకెళ్లిపోయారని, అమ్మగారు చాలా మందికి నగలు ఇచ్చిందని, వాళ్లు ఎవరూ మళ్లీ తిరిగి ఇవ్వలేదని తెలిపారు.
 

అయితే అమ్మకి నగలు, కార్లు అంటే పిచ్చి, లలితా జ్యూవెల్లరి కిరణ్‌కి కూడా నగలు, కార్లు పిచ్చి. ఆయనగోల్డ్ వ్యాపారమే చేశాడు, తమ ఇంటిని కొన్నాక ఆయన వ్యాపారం బాగా కలిసి వచ్చిందని, బాగా ఎదిగాడని తెలిపారు. 

అమ్మ లాగే కార్లు కూడా కొన్నాడని తెలిపారు. అలా అమ్మ సెంటిమెంట్‌ ఆయనకు కలిసి వచ్చిందని తెలిపింది విజయచాముండేశ్వరి. తన భర్తతో కలిసి సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆమె పంచుకుంది. అమ్మ ఆస్తులు అమ్మ తాము వేరే చోట్ల కొనుకున్నామని, అమ్మ కారణంగా చాలా మంది గొప్పగా ఎదిగారని, తాము ఇప్పుడు అనుభవించి ఆస్తులన్నీ అమ్మవే అని తెలిపారు విజయ చాముండేశ్వరి, ఆమె భర్త. 

click me!