సౌత్ లేడీ సూపర్ స్టార్ గా నయనతార..
40 ఏళ్ళు దాటినా.. ఇప్పటికీ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉంది నయనతార. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆమె లేడీ సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా నయనతార రికార్డు క్రియేట్ చేసింది. 20 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో సక్సెసె ఫుల్ హీరోయిన్ గా ఆమె కొనసాగుతోంది.
తెలుగులో ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున, వెంకటేష్, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాల్లో మెరిసింది నయన్. తమిళ్ లో రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, లాంటి స్టార్స్ తో నటించి మెప్పించింది. నయనతర కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రమే కాదు.. భారీ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఆమెకు కూడా నచ్చని చెత్త సినిమాలు ఉన్నాయని మీకు తెలుసా.