సిల్క్ స్మిత చెంప చెళ్లుమనిపించిన చిరంజీవి, కారణం ఏంటో తెలుసా?

Published : Nov 18, 2025, 12:00 PM IST

Chiranjeevi Slapped Silk Smitha : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లను మించి ఇమేజ్ సాధించిన నటి సిల్క్ స్మిత. స్పెషల్ సాంగ్స్ వల్ల కోట్లమంది ఆమెకు ఫ్యాన్స్  అయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఓసందర్భంలో సిల్క్ స్మిత చెంప చెళ్లుమనిపించిన సంగతి మీకు తెలుసా?

PREV
15
హీరోయిన్లను మించిన క్రేజ్...

సౌత్ ఫల్మ్ ఇండస్ట్రీలో సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ప్రపంచంలో సిల్క్ స్మిత పేరు వినగానే వ్యాంప్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. తన మార్క్ నటన, డాన్స్ , అందంతో, గ్లామర్ పాత్రలతో ఆమె సౌత్ ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. ఒక దశలో సిల్క్ స్మిత స్టార్ హీరోయిన్‌ల కంటే ఎక్కువ క్రేజ్, రెమ్యునరేషన్ ను కూడా సంపాదించి, నాలుగు భాషల్లో నటిస్తూ.. ప్రేక్షకులను అలరించింది.. లక్షల్లో అభిమానులను సాధించింది. కెరీర్‌లో మంచి పీక్స్ లో ఉండగా.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలను ఆమె ఫేస్ చేసింది. వాటిని తట్టుకోలేక చివరకు ప్రాణాలు విడిచింది సిల్క్ స్మిత.

25
చిరంజీవి చెంపదెబ్బ..

సిల్క్ స్మిత చాలా కింద స్థాయి నుంచి ఎదిగి స్టార్ గా మారింది. ఈక్రమంలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కొన్ని సినిమాల నుంచి ఆమెను తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కనగల జయకుమార్ వల్ల సిల్క్ స్మిత చిరంజీవి చేత చెంప దెబ్బతిన్న సందర్భం ఒకటి ఉంది. అయితే ఈ విషయంలో తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే.. షూటింగ్ లో సిల్క్ స్మిత చెంప్ప చెళ్లుమనిపించాడట మెగాస్టార్. ఈ దెబ్బతో ఆమె నొప్పి భరించలేక..షూటింగ్ చేయనని కిందపడి ఏడ్చేసిందట. ఈ సంఘటన అగ్నిగుండం సినిమా షూటింగ్ టైమ్ లో జరిగింది.

35
అగ్నిగుండం మూవీ షూటింగ్ లో జరిగిన సంఘటన

1984లో దర్శక–నిర్మాత క్రాంతికుమార్ తెరకెక్కించిన ‘అగ్ని గుండం’ చిత్రంలో చిరంజీవి హీరోగా, సుమలత హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలో సిల్క్ స్మిత కోసం ప్రత్యేకంగా ఒక పాటను క్రాంతి కుమార్ పెట్టారు. ఆ పాట కోసం ప్రత్యేకంగా సిల్మ్ స్మితను తీసుకున్నారు, అయితే గతంలో చిరంజీవి సినిమాలో సిల్క్ కు అవకాశం వస్తే.. అసిస్టెంట్ గా పనిచేసిన జయకుమార్ వల్ల ఆమె ఆ ఆఫర్ ను పోగోట్టుకున్నారు. ఇక అగ్నిగుండం సినిమాకు కూడా జయకుమార్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడని తెలిసి.. సిల్క్ స్మిత.. ఆయన్ను టీజ్ చేయడం స్టార్ట్ చేశారట. ఏవేవో ప్రశ్నలు వేస్తూ.. జయకుమార్ ను విసిగించిందట. ఇదంతా దూరంగా కూర్చుని ఉన్న క్రాంతికుమార్ గమణించారు. జయకుమార్ ను పిలిచి అసలు విషయం కనుక్కున్నారు.

45
క్రాంతికుమార్ వల్లే చిరంజీవి సిల్క్ స్మితను కొట్టారా?

సిల్క్ స్మిత జయకుమార్ ను టీజ్ చేసిందన్న విషయం తెలసుకున్న క్రాంతికుమార్.. చిరంజీవితో ఈ విషయం గురించి మాట్లాడారు. సిల్క్ స్మితతో పాటకు ముంచి చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ లో ఆమెను మెగాస్టార్ చెంపదెబ్బ కొట్టాలి.. రిహార్సెల్ లో ఏదోచిన్నగా చెంపమీద ఆనించినట్టుగా కొట్టిన చిరంజీవి.. టేక్ అనగానే..క్రాంతికుమార్ సైగ చేయడంతో.. సిల్క్ స్మిత చెంప చెళ్లుమనిపించరట. ఆ నొప్పి తట్టుకోలేక ఆమె ఏడ్చుకుంటూ.. కుప్పకూలిపోయిందట. ఆనొప్పితో నేను షూటింగ్ చేయను అని మొరాయించుకుని కూర్చుందట సిల్క్. దాంతో యూనిట్ టీమ్ అంతా చిరంజీవిని బ్రతిమలాడటంతో.. మెగాస్టార్ వెళ్లి సిల్క్ స్మితకు సారికూడా చెప్పారు. ఈ విషయాలను అప్పడు సిల్క్ స్మిత చేత టీజ్ చేయబడిన సీనియర్ రచయిత.. డైరెక్టర్ కనగల జయకుమార్ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

55
సిల్క్ స్మిత జీవితం, మరణం

ఆంధ్రలో పుట్టి పెరిగిన నటి సిల్క్ స్మిత. ఈమె అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. సినిమా ఆమెకు సిల్క్ స్మిత అనే గుర్తింపును ఇచ్చింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ ఇలా చాలా భాషల్లో 450కి పైగా చిత్రాల్లో ఆమె నటించారు. కుటుంబ పరిస్థితి వల్ల చదువు మధ్యలోనే ఆపేసిన సిల్క్ స్మితకు చిన్న వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత భర్త, అత్తగారి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇండస్ట్రీలో తనకంటూ స్టార్డమ్ వచ్చిన తరువాత.. ఆమెకోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు సిల్క్ ఒక్క ఐటమ్ డ్యాన్స్ చేయడానికి 50 వేల వరకు పారితోషికం తీసుకునేదట. ఇది ఇప్పటి కాలంలో 5 కోట్లకు సమానమని చెబుతారు. ఇప్పటి లెక్క ప్రకారం సమంత, రష్మికలు కూడా ఆమె ముందు నిలబడరని చెప్పొచ్చు. వివాదాలు, వ్యక్తిగత ఇబ్బందుల వల్ల సిల్క్ మధ్యానికి బానిస అయ్యింది. చివరికి మానసిక ఒత్తిడి, దుఃఖం తట్టుకోలేక సిల్క్ స్మిత 35 ఏళ్ల వయసులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెబుతారు. కానీ, ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ ఇంక వీడలేదు. మిస్టరీగానే ఉండిపోయింది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి.

Read more Photos on
click me!

Recommended Stories